VIRAT KOHLI: టెస్టుల్లో కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వండి.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ సలహా
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి మరోసారి టెస్టుల్లో భారత జట్టును నడిపించాలని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు.
VIRAT KOHLI: సౌతాఫ్రిగా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న భారత్ ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరపరాజయం పాలైంది. అన్ని విభాగాల్లోనూ చేతులెత్తేసిన రోహిత్ సేన ఇన్నింగ్స్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
NALINI: వీళ్ల సంగతి చూడాలి అన్నా.. సీఎం రేవంత్‌కు నళిని సీక్రెట్ రిపోర్ట్..
విరాట్ కోహ్లి మరోసారి టెస్టుల్లో భారత జట్టును నడిపించాలని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లికి టెస్టు కెప్టెన్‌గా అద్బుతమైన రికార్డు ఉందని, సారథిగా అతడు జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడని గుర్తు చేశాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా 52 పైగా సగటుతో 5000 కంటే ఎక్కువ పరుగులు చేశాడని చెప్పాడు. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు కూడా కోహ్లీదేనని బద్రీనాద్ గుర్తు చేశాడు. అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ మరోసారి టెస్టుల్లో జట్టు పగ్గాలను ఎందుకు చేపట్టకూడదని అతను ప్రశ్నించాడు. బీసీసీఐ సెలక్టర్లు దీనిపై మరోసారి ఆలోచించాలని సూచించాడు. ఇక రోహిత్ కెప్టెన్సీపైనా బద్రీనాథ్ విమర్శలు గుప్పించాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ కంటే కోహ్లి అద్బుతమైన ఆటగాడనీ, అతడు విదేశాల్లో కూడా భారీగా పరుగులు సాధించాడన్నాడు. అయితే రోహిత్‌కు విదేశాల్లో మంచి రికార్డు లేదు.
విదేశాల్లో ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటి వరకు తనకు తాను నిరూపించుకోలేకపోయినా.. జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారన్నాడు. ఇది సరైన నిర్ణయం కాదని తన అభిప్రాయంగా బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కోహ్లీ 68 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తే.. 40 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. కేవలం 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. 2022లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్నాడు.