ముంబైకి వచ్చిన నటాషా కారణం ఏంటో తెలుసా ?
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన భార్య నటాషాతో ఇటీవలే విడిపోయాడు.

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన భార్య నటాషాతో ఇటీవలే విడిపోయాడు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత నటాషా కొడుకు అగస్త్యను తీసుకుని సెర్బియా వెళ్ళిపోయింది. తాజాగా నటాషా ముంబైలో ప్రత్యక్షమైంది. తాన ముంబైకి వచ్చిన ఫోటోలను ఇన్ స్టా స్టోరీస్ లో అభిమానులతో పంచుకుంది. అయితే ఆమె ముంబై ఎందుకు తిరిగి వచ్చిందనేది తెలియలేదు. విడాకుల ప్రక్రియ కోసమే వచ్చిందని పలువురు చెబుతున్నారు. 2020 మే 31న కరోనా సమయంలో వీరి వివాహం జరిగింది వారికి అదే ఏడాది అగస్త్య పుట్టాడు. తర్వాత కొన్నేళ్ళకే విభేదాలు రావడం, ఇన్ స్టాలో ఫోటోలు డిలీట్ చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. చివరికి అదే నిజమై విడాకులపై అధికారిక ప్రకటన చేశారు.