Shreyas Iyer : గాయం పేరు చెప్పి తప్పించారా.. శ్రేయస్‌ను ఎందుకు సెలక్ట్‌ చేయలేదు..

విరాట్ కోహ్లీది అంటే పర్సనల్ రీజన్.. మరి శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు సెలక్ట్‌ చేయలేదు. పైకి గాయమే అని చెప్తున్నా.. ఇంకేదైనా రీజన్ ఉందా.. ఇప్పుడిదే ఇండియన్ క్రికెట్‌ (Indian Cricket) లో హాట్ టాపిక్‌. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు స్క్వాడ్‌ ప్రకటించింది బీసీసీఐ. ఆ మూడింటిలో కింగ్ కోహ్లీ లేడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2024 | 03:02 PMLast Updated on: Feb 11, 2024 | 3:02 PM

Why Was Shreyas Not Selected

విరాట్ కోహ్లీది అంటే పర్సనల్ రీజన్.. మరి శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు సెలక్ట్‌ చేయలేదు. పైకి గాయమే అని చెప్తున్నా.. ఇంకేదైనా రీజన్ ఉందా.. ఇప్పుడిదే ఇండియన్ క్రికెట్‌ (Indian Cricket) లో హాట్ టాపిక్‌. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు స్క్వాడ్‌ ప్రకటించింది బీసీసీఐ. ఆ మూడింటిలో కింగ్ కోహ్లీ లేడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ.. మిగిలిన మూడు టెస్టులకూ సెలక్షన్‌కు అందుబాటులో ఉండడని అంతా ఊహించిందే. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దూరంగా ఉండాలని విరాట్‌ నిర్ణయించుకున్నట్లు భారత క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. కోహ్లీ చూపించిన వ్యక్తిగత కారణాలను బీసీసీఐ గౌరవించింది. అతన్ని మిగతా టెస్టులకు ఎంపిక చేయలేదు.

రన్ మెషిన్‌గా పేరున్న విరాట్‌ కోహ్లీ (Virat Kohli).. తన 13ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్‌ టైం ఓ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. 2011లో టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో ఒక సిరీస్‌ మొత్తానికి దూరమవడం ఇదే మొదటిసారి. 13 ఏళ్లలో ఫిట్‌నెస్‌, ఫామ్‌ లేమి వంటి కారణాలేమీ కోహ్లీని అడ్డుకోలేదు. కోహ్లితో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) … వెన్ను గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వైజాగ్‌ టెస్టు సందర్భంలో తనకు వెన్ను నొప్పి బాధపెడుతుందని.. సెలక్టర్లకు అయ్యర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. పేరుకే గాయం అయినా.. ఒక రకంగా శ్రేయస్ అయ్యర్‌కు సెలక్టర్లు భారీ షాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చంటున్నారు అనలిస్టులు. ఎందుకంటే.. టెస్టులలో అయ్యర్‌ వరుస వైఫల్యాలతో సెలక్టర్లు విసిగిపోయరని టాక్. బీసీసీఐ.. ఎన్నిసార్లు చెప్పినా అతడిలో మార్పు రాకపోవడంతో ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు వేటు వేసినట్టు తెలుస్తోంది.

2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్‌.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో పాటు అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత స్వదేశంలో అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మరీ ముఖ్యంగా 2023 నుంచి టెస్టులలో అతడి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2023లో ఏడు టెస్టులు ఆడిన అయ్యర్‌.. 187 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కేవలం 17గా ఉంది. ఇదే ఫామ్‌ కంటిన్యూ అయితే ఇకపై ఇండియాకు టెస్టులలో ఆడటం కూడా కష్టమేనని టాక్ వినిపిస్తోంది. మరి అయ్యర్ తన తీరు మార్చుకుంటాడా.. ఫామ్‌ దొరికిపుచ్చుకుని మళ్లీ టీమ్‌లోకి వస్తాడా.. వేచి చూడాల్సిందే.