బీసీసీఐకి చెక్ పడనుందా ? రిచ్చెస్ట్ లీగ్ కు సౌదీ ప్లాన్

వరల్డ్ క్రికెట్ లో ఐపీఎల్ సరికొత్త శకానికి తెరతీసిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... బీసీసీఐకి కాసుల వర్షం కురిపించడమే కాదు ప్రపంచ క్రికెట్ లో మరింత శక్తివంతంగా ఎదగడానికి ఐపీఎల్ కూడా ఎంతో దోహదపడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 05:13 PMLast Updated on: Mar 20, 2025 | 5:13 PM

Will Bcci Be Checked Saudi Plan For Richest League

వరల్డ్ క్రికెట్ లో ఐపీఎల్ సరికొత్త శకానికి తెరతీసిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… బీసీసీఐకి కాసుల వర్షం కురిపించడమే కాదు ప్రపంచ క్రికెట్ లో మరింత శక్తివంతంగా ఎదగడానికి ఐపీఎల్ కూడా ఎంతో దోహదపడింది. విదేశీ క్రికెట్ బోర్డులు సైతం బీసీసీఐనే ఫాలో అయ్యేలా చేసింది ఈ లీగ్… ప్రతీ సీజన్ లోనూ వేలాది కోట్లు ఆర్జిస్తూ , వ్యూయర్ షిప్ లోనూ, రెవెన్యూలో రికార్డులు సృష్టిస్తూ అప్రతిహాతంగా ముందుకు దూసుకెళ్ళిపోతోంది. ఇక బీసీసీఐకి, ఐపీఎల్ కు ఎదురేలేదు అనుకునే స్థాయికి అందరూ వచ్చేశారు. కానీ బీసీసీఐ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు సౌదీ అరేబియా పెద్ద స్కేచ్చే వేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ ను రెడీ చేసింది. సౌదీ అరేబియా అనుకున్నట్టుగానే లీగ్ ను ఏర్పాటు చేస్తే, అది ఐపీఎల్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.

సౌదీ అరేబియా.. అతి పెద్ద క్రీడా దేశంగా ఎదిగే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. అందుకోసం ఇప్పటికే గోల్ఫ్, ఫార్మూలా ఓ, 2034 ఫిఫా వరల్డ్ కప్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతోన్న ఆ దేశం.. ఇప్పుడు టీ20 క్రికెట్ లీగ్ లోనూ అడుగులు వేస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం.. కొంతమంది ఆస్ట్రేలియన్ క్రికెట్ నిపుణులు, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ తో కలిసి లీగ్ ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ను సిద్ధం చేయాలని, ప్రాథమికంగా రూ.4,347 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ లీగ్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ నీల్ మ్యాక్స్‌వెల్ గత కొన్నేళ్లుగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇప్పుడీ లీగ్ ఏర్పాటు కనుక జరిగితే ఐపీఎల్ కు ఇది గట్టి పోటీ అవుతుందని అందరి చర్చ.

సౌదీ అరేబియన్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ లీగ్ ను లాంఛ్ చేయనుంది. అలానే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ లీగ్ కోసం ఫండ్స్ ఇవ్వనున్నాయి. 2020 తర్వాత ఫుట్ బాల్, టెన్నిస్, గోల్ఫ్, ఫార్మూలా వన్ రేసింగ్ వంటి క్రీడలపై సౌదీ అరేబియా ఎన్ని బిలియన్లు ఖర్చు చేసింది. అలానే ఫిఫా వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ టీ20 లీగ్.. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కు సిమిలర్ గా ఉండనుంది. ముందు 8 జట్లతో ఇది ప్రారంభం కానుంది. ఏడాది మొత్తం జట్లన్నీ ఇతర దేశాల్లో ఆడతాయి. అనంతరం ఫైనల్ ను సౌదీ అరేబియాలో నిర్వహిస్తారు.

సౌదీ ఏర్పాటు చేయబోయే లీగ్ ఐపీఎల్ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్న మొదలైంది. అయితే ఐపీఎల్ ను దాటాలంటే అనుకున్నంత సులువు కాదు.. అలా అని అసాధ్యం కూడా కాదు. ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రస్తుతం దాదాపు 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఐపీఎల్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఆడతారు. అందుకే తమ లీగ్ లో కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న బడా స్టార్స్ ఆడేందుకు, వారిపై కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో వారు కూడా ఐపీఎల్ కన్నా ఈ కొత్త లీగ్ లోనే ఎక్కువగా ఆడేందుకు ఆసక్తి చూపిస్తారని పలువురి అభిప్రాయం. తద్వారా ఐపీఎల్ పై ఉన్న ఆసక్తి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుందని మరికొంతమంది చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ లీగ్ లో భారత క్రికెటర్లు ఆడే అవకాశం లేదు. ప్రపంచంలో ఎక్కడ లీగ్ జరిగినా ఇండియా క్రికెట్ స్టార్స్ లేకుంటే అంతగా సక్సెస్ కాలేవు. ఇప్పటికే పలు విదేశీ లీగ్స్ తో ఇది రుజువైంది కూడా… కానీ విదేశీ స్టార్ ప్లేయర్స్ లో ఒక్కరిని కూడా వదలకుండా తమ లీగ్ లో ఆడిస్తే ఐపీఎల్ కు గట్టిపోటీనివొచ్చని సౌదీ అరేబియా భావిస్తోంది. అయితే సౌదీ లీగ్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా కీలకమే. ఈ లీగ్ సక్సెస్ అవ్వాలంటే ఐసీసీ సపోర్ట్ కూడా ఉండాల్సిందే.