India vs netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత జట్టుకు కొత్త కెప్టెన్..
నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస విజయాలతో భారత జట్టు అందరికంటే ముందుగా సెమీస్ చేరింది. అందువల్ల నెదర్లాండ్స్‌తో మ్యాచును తేలికగా తీసుకుంది. దీంతో, టీమిండియా మేనేజ్‌మెంట్ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
India vs netherlands: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు వచ్చేసింది. ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆదివారం నెదర్లాండ్స్‌తో ఆడబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో మంచి ప్రదర్శన చేస్తున్న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ 2023 లీగ్స్ దశకు తెర పడుతుంది. ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
Sanju Samson: జాతీయ జట్టుకు కానిస్టేబుల్ కొడుకు.. హ్యాపీ బర్త్ డే సంజు..
ఇక నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస విజయాలతో భారత జట్టు అందరికంటే ముందుగా సెమీస్ చేరింది. అందువల్ల నెదర్లాండ్స్‌తో మ్యాచును తేలికగా తీసుకుంది. దీంతో, టీమిండియా మేనేజ్‌మెంట్ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇవ్వొచ్చు. అదే జరిగితే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు పగ్గాలను అందుకునే ఛాన్స్ ఉంది. జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే.. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అదే సమయంలో రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ తుదిజట్టులో కొనసాగుతారు.