ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ పాతికేళ్ళ నిరీక్షణకు తెరపడేనా ?
ప్రపంచ క్రికెట్ లో న్యూజిలాండ్ నిలకడగా రాణిస్తున్నప్పటకీ మెగాటోర్నీల్లో సత్తా చాటలేకపోతోంది. అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది.

ప్రపంచ క్రికెట్ లో న్యూజిలాండ్ నిలకడగా రాణిస్తున్నప్పటకీ మెగాటోర్నీల్లో సత్తా చాటలేకపోతోంది. అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి పాతికేళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ ను కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. స్టార్ ఆటగాళ్లు, ఆల్ రౌండర్లతో నిండిన న్యూజిలాండ్ క్రికెట్ సెన్సేషనల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే పాకిస్థాన్ లో ట్రై సిరీస్ ఛాంపియన్ గా నిలిచి రెట్టించిన జోష్ తో కనిపిస్తోంది. ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి కివీస్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇదే జోష్ తో మెగాటోర్నీలోనూ తమదైన ముద్ర వేయాలని భావిస్తోంది. కానీ అది అంత సులభం కాకపోవచ్చ. ఎందుకంటే న్యూజిలాండ్ ఉన్న గ్రూపులో భారత్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.బంగ్లా తప్పిస్తే భారత్, పాక్ జట్లతో కివీస్ కు ముప్పుంది. అదే సమయంలో న్యూజిలాండ్ ను కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
ఏ జట్టులో అయినా ఒకరో ఇద్దరో మహా అయితే ముగ్గురు ఆల్ రౌండర్లుంటారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ ప్రకటించిన 15 మంది జట్టులో ఏకంగా ఏడుగురు ఆల్ రౌండర్లున్నారు. ఇదే ఆ జట్టు బలాన్ని చాటిచెబుతోంది. కెప్టెన్ శాంటర్న్, బ్రాస్ వెల్, చాప్ మన్, మిచెల్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నేథన్ స్మిత్ లాంటి ఆల్ రౌండర్లు ఆ జట్టుకు ప్రధాన బలంగా చెప్పొచ్చు. కేన్ మామ జోరు
సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కివీస్ కు పెద్ద బలమనడంలో ఎలాంటి డౌట్ లేదు. ట్రై సిరీస్ లో దక్షిణాఫ్రికాపై కేన్ మామ సెంచరీ చేశాడు. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బ్యాటింగ్ భారం విలియమ్సన్ పైనే ఎక్కువగా ఉంది. అటు విల్ యంగ్, కాన్వే కూడా ఫామ్ లో ఉండటంతో ఆ జట్టు ఈజీగా 300 కు పైగా పరుగులు చేస్తోంది. మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్ తో బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక శాంట్నర్ సారథ్యంలోని స్పిన్ ఎటాక్ కూడా బాగానే ఉంది.
అయితే పేస్ బౌలింగ్ లో అనుభవం లేకపోవడం న్యూజిలాండ్ బలహీనతగా చెప్పొచ్చు. సీనియర్ పేస్ ద్వయం బౌల్ట్, సౌథీ రిటైర్మెంట్ కివీస్ కు మైనస్ పాయింట్. ఫెర్గూసన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో యువ పేసర్లు డఫీ, ఒరోర్క్, స్మిత్ ఎలా రాణిస్తారనేది చూడాలి. మరోవైపు ట్రై సిరీస్ లో గాయం బారిన పడ్డ రచిన్ ఫిట్ నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన మూడు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు. పైగా బంగ్లాదేశ్ చేతిలోనూ అప్పుడు కివీస్ ఓటమి చవిచూసింది. అయితే ప్రస్తుతం ఆ జట్టు ఉన్న ఫామ్ ను చూస్తే సెమీస్ చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.