Yuzvendra Chahal: ఐపిఎల్ నా కలను డిస్ట్రబ్ చేస్తుందా? చాహల్ కోరిక సరైందేనా?
టీమ్‌ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన యుజ్వేంద్ర చాహల్ టెస్టుల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నానని చాహల్ తాజాగా పేర్కొన్నాడు. ‘‘ప్రతి క్రికెటర్‌కు అంతర్జాతీయ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కలలు కంటారు. వారు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన అనంతరం టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెడితే మరింత గౌరవం దక్కుతుంది. నాకు కూడా అలాంటి కల ఉంది. నేను వైట్ బాల్ క్రికెట్‌లో చాలా సాధించాను. కానీ, రెడ్ బాల్ క్రికెట్ ఇప్పటికీ నా చెక్‌లిస్ట్‌లో ఉంది.
నా పేరు పక్కన ‘టెస్ట్ క్రికెటర్’ అనే ట్యాగ్‌ని పొందాలనే కల నాకు ఇప్పటికీ ఉంది. నా కలను నెరవేర్చుకోవడానికి దేశవాళీ, రంజీ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. త్వరలో భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని చాహల్ పేర్కొన్నాడు. 2016లో వన్డేల్లో టీమ్‌ఇండిమా తరఫున అరంగేట్రం చేసిన చాహల్.. 72 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు. 75 టీ20 మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు 187 పడగొట్టిన రికార్డు చాహల్ పేరిటే ఉంది. భారత్ తరఫున చివరగా 2023 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు.