IPL 2024 : ఐపీఎల్ లో విండీస్ పేస్ సంచలనం… కన్నేసిన రాయల్ చాలెంజర్స్
వెస్టిండీస్ (West Indies) నయా పేస్ సంచలనం షమర్ జోసెఫ్(Shamar Joseph) .. ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Windies pace sensation in IPL...Kannesina Royal Challengers
వెస్టిండీస్ (West Indies) నయా పేస్ సంచలనం షమర్ జోసెఫ్(Shamar Joseph) .. ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జోషఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ టామ్ కుర్రాన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు అతను దూరమమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్రాన్ ప్రత్యామ్నాయంగా జోషఫ్ తీసుకోవాలని ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. కుర్రాన్‌ను 1.5 కోట్ల బేస్ ప్రైస్‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
ఇటీవల గబ్బా స్టేడియంలో జోషఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి విండీస్‌కు చారిత్రత్మక విజయం అందించాడు. జోషప్ బొటన వేలు గాయంతో బాధపడుతూనే ఆసీస్‌కు వారి సొంత గడ్డపై చుక్కలు చూపించాడు. ఈ ప్రదర్శనతో జోషఫ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడికి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీలు నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ షమీర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. ఇంటర్నేషనల్ టీ20 (T20) లీగ్ ఓ ఫ్రాంచైజీ కూడా అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది. అయితే బొటన వేలి గాయం కారణంగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌కు షమర్ దూరమయ్యాడు.