మహిళల టీ20 వరల్డ్ కప్.. టికెట్ ధర రూ.114 మాత్రమే
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ సూపర్ న్యూస్ చెప్పింది... వచ్చే నెలలో జరగనున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ వీక్షించేందుకు చాలా తక్కువ ధరలో టికెట్లు ఇవ్వబోతోంది.
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ సూపర్ న్యూస్ చెప్పింది… వచ్చే నెలలో జరగనున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ వీక్షించేందుకు చాలా తక్కువ ధరలో టికెట్లు ఇవ్వబోతోంది. కేవలం 114 రూపాయలతో మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించొచ్చు. అన్నింటికీ మించి మీకు 18 ఏళ్ళ లోపు వయసు ఉంటే స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ… మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ కల్పించే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలవుతుంది. నిజానికి ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉండగా…అక్కడి రాజకీయ అనిశ్చితి కారణంగా నెలకొన్న నిరసనలతో టోర్నీని యూఏకి తరలించారు.
మొత్తం 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. మ్యాచ్ లకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, చారిత్రక షార్జా క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ ఎలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉండగా… గ్రూప్ బి లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ , సౌతాఫ్రికా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ చోటు దక్కించుకున్నాయి. అక్టోబర్ 4న జరిగే తొలి మ్యాచ్ లో భారత మహిళల జట్టు న్యూజిలాండ్ తో తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది.