WORLD CUP CRICKET (ICC) : కప్ గెలిచిన జట్టు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
వరల్డ్ కప్ క్రికెట్ లో ఫైనల్ కి చేారాయి ఇండియా - ఆస్ట్రేలియా. ఈ టోర్నోలో కప్పు గెలుచుకున్న జట్టుకు ప్రైజ్ మనీ ఎంతిస్తారు ? అసలు లీగ్ మ్యాచుల్లో గెలిచిన జట్టు.. ఆడిన ప్రతి జట్టుకు దక్కే డబ్బులు ఎన్ని ? ఆసక్తికర అంశాలపై కథనం చదవండి.

Team India, which has not been able to win the ICC trophy for about ten years, is determined to end that drought with this World Cup.
WORLD CUP CRICKET PRIZE MONEY : ప్రపంచకప్ క్రికెట్ లో భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారో తెలుసా ? ఈ టోర్నీలో విజేతకు 40 లక్షల డాలర్లు అంటే రూ.33.31 కోట్ల రూపాయలు అందిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 2 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.16.65 కోట్ల మనీ దక్కనుంది. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు అంటే రూ.83.29 కోట్లు. ఫైనల్స్‌కు చేరిన రెండు జట్లు కాకుండా లీగ్ దశలో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 వేల డాలర్ల చొప్పున ఇస్తున్నారు. సెమీ ఫైనల్స్‌లో ఓడిన ఒక్కో జట్టుకు 8 లక్షల డాలర్లను ICC అందజేయనుంది. లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి బయటకు వెళ్లిన ఒక్కో జట్టుకు లక్ష డాలర్ల చొప్పున ఇస్తారు.