World Cup Jersey : వరల్డ్ కప్ జెర్సీ లాంఛ్ అదుర్స్…
టీ ట్వంటీ (T20) ప్రపంచకప్ (World Cup) కు కౌంట్ డౌన్ మొదలయింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) కూడా భారత జట్టును ఎంపిక చేసింది.

World Cup Jersey Launch Adurs...
టీ ట్వంటీ (T20) ప్రపంచకప్ (World Cup) కు కౌంట్ డౌన్ మొదలయింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) కూడా భారత జట్టును ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో భారత క్రికెటర్లు ధరించే జెర్సీని కూడా లాంఛ్ చేసింది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం టీమిండియా (Team India) జెర్సీ (Jersey).. బ్లూ, ఆరెంజ్ కలర్ కాంబినేషన్‍తో రూపొందింది. జెర్సీ ఎక్కువ శాతం బ్లూ కలర్‌లో ఉండగా.. భుజాలపై ఆరెంజ్ కలర్ ఉంది. దీనిపై వైట్ స్ట్రిప్స్ ఉన్నాయి. కాలర్‌పై భారత జాతీయ పతాకంలా మూడు రంగులు ఉన్నాయి. జెర్సీ ఇరు వైపులా కూడా సైడ్‍కు ఆరెంజ్ కలర్‌లో లైన్ కనిపిస్తోంది. ఈసారి జెర్సీలో కాషాయ రంగు ఎక్కువగానే ఉంది. జెర్సీపై ఇండియా పేరు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంది. కాగా ధర్మశాల స్టేడియం (Dharamshala Stadium) లో హెలీకాప్టర్ ద్వారా జెర్సీని ఆవిష్కరిస్తున్నట్టుగా ఈ వీడియో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరికొందరు భారత ఆటగాళ్లు.. ఆకాశంలో విహరిస్తున్న జెర్సీని చూస్తున్నట్టుగా ఈ వీడియో రూపొందింది.