WPL RCB Allrounder : నిప్పులు చెరిగిన ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ..

డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ముప్పుతిప్పలు పెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 12:56 PMLast Updated on: Mar 13, 2024 | 12:56 PM

Wpl Rcb All Rounder Aussie Star Ellyse Perry Is Under Fire

డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ముప్పుతిప్పలు పెట్టింది.

తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. పెర్రీ సాధించిన 6 వికెట్లు కూడా బౌల్డ్‌లు, ఎల్బీ రూపంలో వచ్చినివే. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన పెర్రీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ కాప్‌ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కాప్‌ రికార్డును పెర్రీ బ్రేక్‌ చేసింది.