SARFARAJ RUN OUT : రాంగ్ కాల్ రన్ అవుట్… షాక్ లో సర్ఫరాజ్

మాంచి దూకుడు మీదున్నాడు. అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సెంచరీ కూడా ఈజీగా కొట్టేస్తాడనుకునేలోపే.. రాంగ్ కాల్ రనౌట్ చేసింది. అంతే అటు గ్రౌండ్‌లో.. ఇటూ బయట విమర్శల వర్షం స్టార్ట్ అయింది. నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో ట్రోల్స్‌ రావడంతో.. నాదే తప్పు.. సారీ అనేశాడు జడేజా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 09:07 AMLast Updated on: Feb 16, 2024 | 9:07 AM

Wrong Call Run Out Sarfaraz In Shock

మాంచి దూకుడు మీదున్నాడు. అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సెంచరీ కూడా ఈజీగా కొట్టేస్తాడనుకునేలోపే.. రాంగ్ కాల్ రనౌట్ చేసింది. అంతే అటు గ్రౌండ్‌లో.. ఇటూ బయట విమర్శల వర్షం స్టార్ట్ అయింది. నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో ట్రోల్స్‌ రావడంతో.. నాదే తప్పు.. సారీ అనేశాడు జడేజా. అయితే.. లోపల్లోపల బాధ ఉన్నా క్రికెట్‌లో రనౌట్ కామన్ అంటూ ఇష్యూను లైట్‌ చేసేందుకు ట్రై చేశాడు డెబ్యూ స్టార్ సర్ఫరాజ్ ఖాన్.

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించిన యూపీ కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే.. ఫియర్‌లెస్ గేమ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టి 62 పరుగులతో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఆడేది టెస్ట్ అయినా.. వన్డే లెవల్‌లో విజృంభించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సర్ఫరాజ్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతే కాకుండా.. టెస్ట్‌ల్లో భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ ఈక్వల్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌ అనే టెన్షన్ లేకుండా.. గ్రౌండ్‌లో పరుగుల వేట మొదలెట్టాడు. లూజ్ బాల్ కనిపిస్తే బౌండరీ లైన్ దాటించేశాడు.

ఈజీగానే సెంచరీ కూడా చేసేస్తాడనుకునేలోపే.. రనౌట్‌ రూపంలో బ్యాడ్‌ లక్‌ వెంటాడింది. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర సీనియర్ ప్లేయర్, ఆల్‌రౌండర్ జడేజా ఇచ్చిన రాంగ్ కాల్‌.. సర్ఫరాజ్ ఖాన్ కొంపముంచింది. అండర్సన్‌ బౌలింగ్‌లో మిడాన్ దిశగా ఆడిన జడేజా.. క్విక్ సింగిల్‌ తీయాలనుకున్నాడు. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను పిలిచాడు. కానీ అప్పటికప్పడు డెసిషన్ మార్చుకున్న జడేజా.. నో చెబుతూ క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. అప్పటికే మరో ఎండ్ నుంచి క్రీజ్ దాటి వచ్చిన సర్ఫరాజ్ వెనక్కి వెళ్లలేకపోయాడు. మార్క్ వుడ్ డైరెక్ట్ హిట్ చేశాడు. సెంచరీ కొట్టే ఊపులో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. మార్క్‌ వుడ్ బుల్ త్రో కారణంగా నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతే గ్రౌండ్‌ అంతా ఒక్కసారిగా మూగబోయింది.

సర్ఫరాజ్ రనౌట్ కావడం ఆలస్యం.. ట్రోలింగ్‌తో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఇప్పటికే 10 మంది రనౌట్లకు కారణమయ్యాడు. ఎన్నో అశలతో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్‌ను కూడా బలి తీసుకున్నాడంటూ జడేజాపై విమర్శల వర్షం కురిపించారు. అటు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా.. కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. ఫ్రస్టేషన్‌తో అరుస్తూ క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే.. సర్ఫరాజ్ రనౌట్ అయిన వెంటనే సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా.. ఈ శతకాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు. ఎప్పుడూ బ్యాట్‌ను స్టైలిష్‌గా తిప్పేవాడు కానీ.. ఇప్పుడు సెలబ్రేట్‌ చేయలేదు. మరోవైపు.. ట్రోల్స్ పెరిగిపోవడంతో రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో చాలా బాధగా ఉంది. నిజానికి తప్పు నాదే. లేని పరుగు కోసం నేను ఫస్ట్ కాల్ ఇచ్చా. వెల్ ప్లేయిడ్ సర్ఫరాజ్ అంటూ పోస్ట్ చేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత తన ఫీలింగ్స్ షేర్‌ చేసుకున్న సర్ఫరాజ్ ఇష్యూను లైట్‌ చేసే ప్రయత్నం చేశాడు. క్రికెట్ అన్నాక రనౌట్స్ సహజమే అని చెప్పుకొచ్చాడు. చిన్న మిస్ కమ్యునికేషన్ వల్ల ఇది జరిగింది. ఆటలో ఇవన్నీ కామన్, జడేజా సపోర్ట్ చేయడం వల్లే హాఫ్ సెంచరీ చేశానంటూ సర్ఫరాజ్ చెప్పాడు.

వాస్తవంగా టీమిండియాలో ప్లేస్‌ కోసం సర్ఫరాజ్ సుదీర్ఘ కాలం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. మూడో టెస్టుతో ఎంట్రీ ఇచ్చినా.. అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్ చూస్తే అన్నీ రికార్డులే కనిపిస్తాయి. 2014లో 45 మ్యాచ్ లో 14 సెంచరీలతో 3వేల 912 పరుగులు చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సగటు 69.85గా ఉంది. రెండు వరుస రంజీ సీజన్లలో 900కు పైగా రన్ చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా సర్ఫరాజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.