రసవత్తరంగా WTC ఫైనల్ రేస్ రెండో ప్లేస్ కోసం హోరాహోరీ
వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేస్ రసవత్తరంగా సాగితోంది. వరుస విజయాలతో భారత్ దాదాపుగా ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోగా మరో ప్లేస్ కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. తాజాగా వరుస విజయాలతో ఇంగ్లాండ్ ఫైనల్ రేసులోకి తిరిగొచ్చింది. నెల రోజుల క్రితం ఏడో స్థానంలో నిలిచిన ఇంగ్లిష్ జట్టు ఇపుడు టాప్-4లోకి దూసుకొచ్చింది. స్వదేశంలో ఇటీవల వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. శ్రీలంకపై తొలి టెస్టులో అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆసీస్ , కివీస్ జట్లకు టెన్షన్ మొదలయింది.న్యూజిలాండ్.. భారత్‌తో మూడు, శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుని, టీమిండియాను ప్రతిఘటిస్తే కివీస్ తన పర్సంటేజ్‌ను మెరుగుపర్చుకుంటుంది.
ఇక భారత్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ చిత్తుగా ఓడితే రెండో స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన అనంతరం పాకిస్థాన్‌తో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. లంక, పాక్‌లపై ఓటమెరుగకుండా సత్తాచాటితే ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. 2023 నుంచి 2025 వరకు జరుగనున్న టెస్టు మ్యాచ్‌ల విజయాల శాతం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు జట్లు అర్హత సాధిస్తాయి.