ఒకే ఓవర్లో 5 సిక్సర్లు ఇచ్చాడు.. కట్ చేస్తే జాతీయ జట్టులోకి ఎంట్రీ
క్రికెట్ లో ప్రతీ ప్లేయర్ కూ ఒక బ్యాడ్ డే ఉంటుంది... ఇలాంటి పరిస్థితే ఆ యువ పేసర్ కు ఎదురైంది...ఐపీఎల్ 2023 సీజన్ లో రింకూ సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లు ఎవ్వరూ మరిచిపోలేరు.
క్రికెట్ లో ప్రతీ ప్లేయర్ కూ ఒక బ్యాడ్ డే ఉంటుంది… ఇలాంటి పరిస్థితే ఆ యువ పేసర్ కు ఎదురైంది…ఐపీఎల్ 2023 సీజన్ లో రింకూ సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లు ఎవ్వరూ మరిచిపోలేరు. చివరి ఓవర్లో విజయానికి 29 రన్స్ చేయాల్సి ఉండగా బంతిని అందుకున్న యశ్ దయాల్ కు ఆ రాత్రి కాళరాత్రిగానే మిగిలింది. రింకూ సింగ్ విధ్వంసానికి ఏకంగా ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఫలితంగా తీవ్ర విమర్శలకు గురయ్యాడు. మానసికంగానూ కృంగిపోయాడు… కానీ కొద్దిరోజుల్లోనే మళ్ళీ కోలుకుని నార్మల్ అయ్యాడు. 2024 సీజన్ లో ఆర్సీబీ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
అంతేకాదు ఇక్కడ నుంచి కాన్ఫిడెన్స్ పెరిగిన యశ్ దేశవాళీ క్రికెట్ లోనూ తన ఫామ్ కొనసాగించాడు. బౌలింగ్ లో వేరియేషన్స్ చూపించి ఫలితాలు అందుకున్నాడు. 24 మ్యాచ్ లలో 76 వికెట్లు పడగొట్టాడు. తాజాగా దులీప్ ట్రోఫీలో అదిరిపోయే బౌలింగ్ తో సెలక్టర్లను ఆకట్టుకున్న ఈ యూపీ లెఫ్టార్మ్ పేసర్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. రింకూసింగ్ దెబ్బకు కెరీర్ ముగిసిందనుకుంటే మళ్ళీ పట్టుదలతో తన సత్తా నిరూపించుకున్న యశ్ ఏడాది తర్వాత టీమిండియాలోకి వచ్చేశాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో ఇదే ఫామ్ కొనసాగిస్తే పేస్ విభాగంలో భారత్ కు మరో ఆప్షన్ దొరికినట్టే.