Yashasvi Jaiswal: జైశ్వాల్ రికార్డులే రికార్డులు.. కోహ్టీ రికార్డు సమం..
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి 655 పరుగులు చేశాడు. ఎనిమిదేళ్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ 655 పరుగులు చేశాడు.
Yashasvi Jaiswal: పరుగుల వరద పారిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో అరుదైన ఘనత సాధించాడు. స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లి సరసన జైస్వాల్ నిలిచాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో జైస్వాల్ ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు కోహ్లి పేరిట ఉండేది.
ROHIT SHARMA: బజ్‌బాల్ దూకుడుకు హిట్‌మ్యాన్ చెక్.. రోహిత్‌శర్మ అరుదైన ఘనత
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి 655 పరుగులు చేశాడు. ఎనిమిదేళ్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ 655 పరుగులు చేశాడు. ఈ జాబితాలో జైస్వాల్, విరాట్ కోహ్లి తర్వాత స్థానాలో రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అలాగే 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్‌లో 600పైగా పరుగులు చేసిన భారత మొదటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో 600 పైగా పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లి, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇక రాంఛీ టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. నాలుగోరోజు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి ఔటవగా.. తర్వాత తడబడినప్పటికీ.. గిల్, ధృవ్ జురెల్ కీలక ఇన్నింగ్స్‌లతో భారత్ గెలుపుతీరాలకు చేరుకుంది.