Yashasvi Jaiswal: రాజ్‌కోట్ టెస్టులో జైస్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో పట్టుబిగించిన భారత్
భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు.

Yashasvi Jaiswal: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. దీంతో ఇంగ్లండ్ కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.
Suhani Bhatnagar: చిన్న వయసులోనే కన్నుమూసిన దంగల్ నటి.. కారణం ఇదే..
దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. సిరాజ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు, జడేజా రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. రోహిత్ త్వరగానే ఔట్ అవగా జైస్వాల్, గిల్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 161 రన్స్ జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ సాధించాడు. ఈ సీరీస్‌లో అతనికి ఇది రెండో శతకం.
ఓవరాల్‌గా టెస్ట్ కెరీర్‌లో మూడోది. అటు గిల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత జైస్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‍కు వెళ్లాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 196 రన్స్ చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా నాలుగో రోజు దూకుడుగా ఆడి డిక్లేర్ చేసే అవకాశం ఉంది.