JIndia Vs West Indies: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 41000 /- అసలు కథ ఇదే?
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక స్పిన్నర్లు చెలరేగడంతో మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ 387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. జైస్వాల్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డ్‌పై తాజాగా నెట్టింట దుమారాన్ని రేపుతోంది.
ప్రస్తుతం దీనిపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియా వేడి వేడిగా చర్చ కూడా మొదలైంది. అసలు ఈ రచ్చ అంతా ఎందుకంటే.. యశస్వి జైశ్వాల్‌కు రివార్డుగా ఇచ్చిన మొత్తం 500 అమెరికా డాలర్లు కావడమే. ఈ మొత్తం మన భారత కరెన్సీలో సుమారు రూ.41,000 మాత్రమే. ఇదే చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా పేరొందిన బీసీసీఐ చరిత్రలో ఇంత తక్కువ మొత్తం ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ప్రైజ్ మనీని అందిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ రివార్డ్ మనీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
భారత దేశవాళీ క్రికెట్ లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పారితోషికం ఎక్కువ అని సెటైర్లు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్ బోర్డు పరిస్ధితి ఆర్థికంగా అంతగా బాలేదని చెప్పాలి. వాస్తవానికి టీమ్ ఇండియా కూడా ఈ సిరీస్ ఆడేందుకు ప్రధాన కారణమే వెస్టిండీస్ బోర్డుకు ఆర్థిక సహకారం అందించడమే. ఈ కారణం వల్లే వెస్టిండీస్ బోర్డు రివార్డ్ మొత్తాన్ని 500 అమెరికన్ డాలర్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంత తక్కువ మొత్తంలో రివార్డ్ బహుకరించడం నెట్టింట అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనికంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్ అని జోకులు పేల్చుతున్నారు.