Yazvendra Chawla : చావ్లా అరుదైన రికార్డ్…
ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. పలువురు ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులతో అదరగొడుతున్నారు.

Yazvendra Chawla's rare record...
ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. పలువురు ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులతో అదరగొడుతున్నారు. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్టార్ స్పిన్నర్(Mumbai star spinner), టీమిండియా (Team India) మాజీ బౌలర్ పియూష్ చావ్లా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ వికెట్ ను పడగొట్టడం ద్వారా చావ్లా ఈ రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ రికార్డు నెలకొల్పిన రెండో బౌలర్ గా నిలిచాడు. తద్వారా విండీస్ మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో రికార్డును చావ్లా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ ఇప్పటి వరకు 189 మ్యాచ్ లు ఆడిన చావ్లా 184 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ స్పిన్నర్ (Team India’s star spinner) యజ్వేంద్ర చాహల్ ( Yazvendra Chahal) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ కేవలం 155 మ్యాచ్ ల్లోనే 200 వికెట్లను తీశాడు. 35 ఏళ్ల వయసులో చావ్లా అరుదైన రికార్డు సాధించడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యంతో ముంబై పరాజయం పాలై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.