హార్థిక్ చేతికి లగ్జరీ వాచ్ ధర తెలిస్తే మీకు షాకే

మన దేశంలో టీమిండియా క్రికెటర్ల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... జాతీయ జట్టులోకి ఎంపికైతే చాలు సెలబ్రిటీగా మారిపోతారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 08:30 PMLast Updated on: Feb 25, 2025 | 8:30 PM

You Will Be Shocked To Know The Price Of A Luxury Watch On Harthiks Hand

మన దేశంలో టీమిండియా క్రికెటర్ల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… జాతీయ జట్టులోకి ఎంపికైతే చాలు సెలబ్రిటీగా మారిపోతారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత యువ ఆటగాళ్ళు చాలా మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. జాతీయ జట్టుకు ఎంపికయిన యువ ఆటగాళ్ళలో చాలా మంది మిడిల్ క్లాస్, పేద వర్గాల నుంచి వచ్చినవారే ఉంటారు. టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడే… ఒకప్పుడు మ్యాగీ నూడుల్స్ తో సరిపెట్టుకుని క్రికెట్ కోచింగ్ కు వెళ్ళిన కథ పాండ్యాది.. కానీ ఐపీఎల్ తో అతని కెరీర్ టర్న్ అయింది. తర్వాత జాతీయ జట్టులో అగ్రశ్రేణి క్రికెటర్ గానూ ఎదిగి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. అందుకే ఇప్పుడు లగ్జరీ లైఫ్ స్టైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో కీలక వికెట్లు తీసిన పాండ్యా ధరించిన వాచీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ వాచీ గురించి క్రికెట్‌ అభిమానులు ఆరా తీయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి.

ఈ వాచీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల్లో ఒకటైన రిచర్డ్ మిల్లె RM 27-02 టైమ్‌పీస్‌ అని తెలిసింది. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 6.92 కోట్లుంటుంది. ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ‍అత్యంత సంపన్నులు మాత్రమే ఇలాంటి ఖరీదైన ఈ వాచీలను ఉపయోగిస్తుంటారు. ఈ వాచీ విలువ తెలిసి క్రికెట్‌ అభిమానులు షాక్‌ తిన్నారు. ఈ వాచ్ చాలా క్లాసీగా, యూనిక్ డిజైన్‌లో కనిపిస్తుంది. బ్లూ ఎలాస్టిక్ బ్యాండ్‌తో వచ్చే యూనిక్ వైట్ క్వార్ట్జ్ కేస్ డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ఫిక్స్‌డ్ వైట్ క్వార్ట్జ్ బెజెల్, సిల్వర్-టోన్ హ్యాండ్స్, ఇండెక్స్ మార్కర్స్‌తో వచ్చే స్లీక్ బ్యాక్ డయల్.. దీనికి అడ్వాన్స్‌డ్ లుక్ అందించాయి. ఏ లైటింగ్ కండిషన్‌లో అయినా బెస్ట్ విజిబిలిటీ దీని సొంతం.

ఈ అరుదైన వాచీని మొదట టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం రూపొందించారని తెలుస్తోంది. అందుకే ఈ లిమిటెడ్ ఎడిషన్‌ మోడల్ నేమ్‌లో లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ పేరును యాడ్ చేసింది. ఇలాంటి వాచీలు ఇప్పటివరకు కేవలం 50 మాత్రమే తయారుచేశారని సమాచారం. అందుకే సెలబ్రిటీలు, స్పోర్ట్‌స్టర్స్ దీన్ని తమ కలెక్షన్స్‌లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారత క్రికెటర్లలో హార్దిక్ ఒక్కడి దగ్గరే ఈ వాచ్‌ ఉంది.