Yuvraj Singh: మరోసారి తండ్రైన యువరాజ్.. పాప ఎంత ముద్దుగా ఉందో..!
యువరాజ్ సింగ్, మోడల్ హేజెల్ కీచ్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు పెళ్లైన ఆరేళ్లకు.. అంటే 2022లో తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. హేజెల్ లీచ్ 2022 జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ దంపతులకు రెండోసారి ఆడబిడ్డ జన్మించింది.

Yuvraj Singh: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి తండ్రయ్యాడు. యువరాజ్ భార్య హేజెల్ కీచ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా యువరాజ్ ఈ విషయాన్ని చెప్పాడు. “మా లిటిల్ ప్రిన్సెస్ ఆరాకు వెల్కమ్, ఆమె రాకతో మా కుటుంబం సంపూర్ణం అయింది. నిద్రలేని రాత్రులు చాలా ఆనందదాయకంగా మారాయి” అంటూ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
యువరాజ్ సింగ్, మోడల్ హేజెల్ కీచ్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు పెళ్లైన ఆరేళ్లకు.. అంటే 2022లో తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. హేజెల్ లీచ్ 2022 జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ దంపతులకు రెండోసారి ఆడబిడ్డ జన్మించింది. యువరాజ్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్ సింగ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కంగ్రాట్స్ యువీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజ్ సింగ్.. 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఒకే ఓవర్‌లో 6 బంతుల్లో యువీ 6 సిక్సర్లు బాదడం అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ.. జట్టు జగజ్జేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు.