Yuvraj Singh: పోరాట సింహం.. హ్యాపీ బర్త్ డే యూవీ..
పోరాట యోధుడిగా.. భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడిగా.. క్రికెట్ చరిత్రలో పంజాబీ పుత్తర్ యువరాజ్ సింగ్ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యువీ ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించాడు .

Yuvraj Singh: యువరాజ్ సింగ్.. ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. అద్భుత పోరాటపటిమకు నిలువెత్తు నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు దక్కిన ఆణిముత్యం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అద్భుతమైన ఆటతీరుతో విజయాన్ని అందించిన సందర్భాలు అనేకం. ఈరోజు యువీ 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు. పోరాట యోధుడిగా.. భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడిగా.. క్రికెట్ చరిత్రలో పంజాబీ పుత్తర్ యువరాజ్ సింగ్ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు.
Virat Kohli: ఫ్యామిలీ స్టార్‌గా మారిన రన్ మెషీన్.. విరాట్ మ్యారేజ్ డే..
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యువీ ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించాడు . వరల్డ్ కప్ గెలవడంలో యువీ ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే. ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, స్పిన్ బౌలర్‌గా, చురుకైన ఫీల్డర్‌గా టీమిండియాకు దాదాపు 2 దశాబ్దాల పాటు తన సేవలందించాడు యువీ. సిసలైన ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
1981, డిసెంబర్ 12న జన్మించిన యువీ నేడు 42వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యూవీకి తోటి క్రీడాకారులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.