Yuvraj Singh: యువరాజ్ సింగ్ పోలీస్ ఛేజ్ ఒక పనిమనిషి
క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబానన్ సింగ్‌ను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించి రూ.40 లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నించిన యువతిని ఢిల్లీలోని గురుగ్రామ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Yuvraj Singh's younger brother Zoravar Singh has appointed Hema Kaushik as his caretaker
యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్ గత 10 ఏళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. కాబట్టి, అతని సంరక్షణ కోసం హేమ కౌశిక్ అలియాస్ డింపీని 2022లో కేర్‌టేకర్‌గా నియమించారు. అయితే ఆమె నియామకం జరిగిన 20 రోజుల్లోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో కోపోద్రిక్తురాలైన హేమ యువరాజ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకునేందుకు రూ.40 లక్షలు ఇవ్వకుంటే తప్పుడు కేసు పెడతానని బెదిరించింది.
దీనిపై మాట్లాడిన యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. నా కొడుకు బాగోగులు చూసేందుకు హేమ కౌశిక్‌ని నియమించాం. కానీ, ఆమె నియామకం జరిగిన 20 రోజులకే, ఆమె వ్యవహారం తేడాగా అనిపించింది. అలాగే ఆమె నా కొడుకుని తన వలలో వేసుకోవడానికి ప్రయత్నిచింది. అందుకే హేమ కౌశిక్‌ని పనిలోంచి తొలగించాను అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జులై 19న షబ్నమ్ సింగ్‌కు మెసేజ్ చేసిన హేమ కౌశిక్.. డబ్బులు చెల్లించకపోతే జులై 23న ఎఫ్‌ఐఆర్ పెడతానని బెదిరించింది.
దీంతో షాకైన షబ్నం.. డబ్బు కట్టేందుకు సమయం కావాలని హేమను కోరింది. అనంతరం డీఎల్‌ఎఫ్ ఫేజ్ 1 పోలీస్ స్టేషన్‌లో షబ్నమ్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హేమకు అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ఇవ్వాలని ప్లాన్ చేశారు. అందుకోసం పోలీసుల పథకం ప్రకారం మంగళవారం అడ్వాన్స్ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షబ్నమ్ సింగ్ ఫిర్యాదు మేరకు హేమపై ఐపీసీ 384 కింద దోపిడీ కేసు నమోదైంది.