జంపా@100 వన్డేలు ఆసీస్ స్పిన్నర్ రికార్డ్
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకుండా 100 వన్డేలు ఆడిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకుండా 100 వన్డేలు ఆడిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. జంపా తన కెరీర్ లో ఇప్పటి వరకూ 100 వన్డేల్లో 170 వికెట్లు, 92 టీ ట్వంటీల్లో 111 వికెట్లు తీశాడు. టెస్టుల్లో నాథన్ లయన్ ఆసీస్ కు ప్రధాన స్పిన్నర్ గా ఉండడంతో జంపాకు అవకాశం దక్కడం లేదు. దీనికి తోడు పలువురు పార్ట్ టైమ్ స్పిన్నర్లు కూడా ఉండడంతో వన్డేలకే పరిమితమయ్యాడు. అయితే వచ్చే యాషెస్ సిరీస్ కు జంపా ఎంపికయ్యే అవకాశముంది.