Home » Tag » కాంగ్రెస్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు లక్కు కలిసొచ్చింది. ఇప్పటికిప్పుడు రెండు ఎమ్మెల్సీలు ఆ పార్టీ గెలుచుకోబోతోంది. శాసనమండలిలో కేవలం ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో CMO కార్యదర్శిగా... ఒక వెలుగు వెలిగిన IAS అధికారి స్మితా సభర్వాల్ ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో లూప్ లైన్లో పడ్డారు. 26 మంది IAS అధికారుల బదిలీల్లో స్మిత సభర్వాల్ కు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టును ఆమెకు కేటాయించారు.
వైఎస్ షర్మిల... ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 4న తన వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసి... ప్రధాని నరేంద్రమోడీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు. కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం. దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మొన్న మహరాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్ లో ఆప్ పార్టీ... ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్’ కూడా ఉంది. ఈ గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని తెలంగాణలో సామాన్య జనం ఎదురు చూస్తున్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.
మాజీ సీఎం మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి తప్ప పైసా ప్రయోజనం కూడా కిరణ్ కమార్ రెడ్డి వల్ల ఉండకపోవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.
కర్ణాటకలో మేజర్ కులాలు లింగాయత్, వక్కలిగ.. ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు కూడగడితే ఆ పార్టీ గెలిచినట్లే. అయితే రెండు వర్గాలు ఒకరికే మద్దతు ఇవ్వడం అరుదు. అయితే ఈసారి ఎలా ఉంటుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, లెక్కలు చూస్తే.. కారు జోరుకు బ్రేకులు పడే చాన్స్ కూడా కనిపించడం లేదు. కారు పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఇది చాలు మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని చెప్పడానికి !