Home » Tag » కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన యశోదాకు తరలించారు.
కేసీఆర్ దెబ్బకు సిట్టింగుల్లో చాలామందికి నిద్ర రావడం లేదు. ఎప్పుడు ఫోన్ వస్తుందో.... వస్తే ఏం చెబుతారోనని టెన్షన్ పడుతున్నారు. సీటు దక్కుతుందని క్లారిటీ వచ్చేసిన వారు ఊపిరి పీల్చుకుంటుంటే రానివారికి మాత్రం బీపీ ఓ రేంజ్లో పెరుగుతోంది.
తెలంగాణ నూతన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని హంగులతో ఇది తయారైంది. అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది.
పక్క రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగసభలు పెడుతున్నావ్... ? మరి జనసమీకరణకు వాటికి అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తున్నావ్..? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావ్... మరి ఆ సొమ్ములెక్కడివి...? నీ బిడ్డ కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ వెళ్లి వస్తోంది.. మరి దానికెవరు ఖర్చు చేస్తున్నారు..? ఇవి ప్రతిపక్షాలు మాత్రమే సంధిస్తున్న ప్రశ్నలు కాదు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు కూడా...!
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, లెక్కలు చూస్తే.. కారు జోరుకు బ్రేకులు పడే చాన్స్ కూడా కనిపించడం లేదు. కారు పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఇది చాలు మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని చెప్పడానికి !
కవితను అరెస్ట్ చేస్తే... ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయ్. కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడో జరిగే పరిణామానికి ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టే కేసీఆర్.. కవిత వ్యవహారంలో స్ట్రాంగ్ వ్యూహమే రెడీ చేసి ఉంటారన్నది మరికొందిరి అభిప్రాయం.
ఏకంగా కేసీఆర్ కుమార్తె కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ప్రయోగిస్తోంది. ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ముందరికాళ్లకు బంధం వేసినట్లే. కేసీఆర్ ఎక్కడికెళ్లినా కవిత ఇష్యూకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ ను వ్యూహాత్మకంగా బంధిస్తోంది బీజేపీ.
గులాబీ పార్టీలో లుకలుకల కోసం బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది. అసంతృప్తిగా ఉన్న నేతలను.. తమ పార్టీలోకి లాగేందుకు వల వేసి రెడీగా ఉంది. 45మంది పక్కనపెట్టినా ఇబ్బందే.. పెట్టకపోయినా ఇబ్బందే.. దీంతో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.
ఏపీ దుస్థితికి కారణం అయిన కేసీఆర్.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు అంటూ.. చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సవాళ్లు ఎదురుకాకపోవచ్చు.. ఎన్నికల టైమ్‌కు స్టార్ట్ అవుతాయ్ నిలదీతలు !
కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా ఉండడంతో.. బీఆర్ఎస్ పార్టీది ఆడింది ఆట అన్నట్లుగా తయారయింది. సరైన ప్రత్యామ్నాయం ఏదీ కనిపించకపోవడంతో.. ఆలోచనలన్నీ ఎటు తిరిగినా.. చివరికి కారు దగ్గరే వచ్చి పార్క్ అవుతున్నాయ్.