Home » Tag » జనసేన
తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.
టిడిపితో వెళ్ళొద్దని తమతోనే ఉండాలని పవన్ కళ్యాణ్ కు బిజెపి హై కమాండ్ స్పష్టం చేసింది. తమను కాదని వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. దీంతో ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేశారు.
ఎప్పుడో జరగబోయే దానికోసం ఇప్పుడు కళ్ల ముందున్న అవకాశాన్ని వదులుకోవాలా.. అని పవన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వైసీపీని ఓడించకపోతే తాము మరింత ఇబ్బందుల్లో పడతామనేది పవన్ ఆలోచన. అందుకే బీజేపీ మాటలు వినాలా.. లేకుంటే టీడీపీతో వెళ్లాలా.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పవన్ కల్యాణ్ టీడీపీ తరపున రాయబారం చేయడానికి వచ్చారనేది బీజేపీ చెప్తున్న మాట. తమ పార్టీ కోసం కాకుండా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని పొత్తులపై చర్చించడానికి వచ్చినట్లు బీజేపీ భావిస్తోంది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కించుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని తప్పులు ఆ పార్టీని వెనక్కు లాగుతున్నాయి.
50సీట్లు కేటాయిస్తే.. మొదటికే మోసం వచ్చి అవకాశం ఉంటుందని.. జగన్‌కు మళ్లీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించే ప్రయత్నాలు సాగుతున్నాయ్. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా.. అర్థం చేసుకుంటారా..?
జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి వైసీపీ అనుకున్నట్టు జరగదని.. ప్రజలు అనుకున్నట్టే జరుగుతుందని చెప్పారు. దీన్ని బట్టి పొత్తులుంటాయని క్లియర్ గా చెప్పేశారు.
పొత్తులపై తన మనసులో ఏముందో స్పష్టత ఇచ్చేశారు పవన్. ఇప్పటం ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించిన పవన్ సరిగ్గా ఏడాది తర్వాత టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
వైసీపీలో అసంతృప్తులు పీక్స్‌కు చేరాయ్. దాదాపు ప్రతీ జిల్లాలో నాయకుల మధ్యవిభేదాలు ఉన్నాయ్. వారందరినీ టార్గెట్ చేసే పనిలో పడింది జనసేన.
జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా యుద్ధం మొదలుపెట్టిన పవన్.. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు తీసుకువస్తున్నారు.