Home » Tag » పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో కుల సమీకరణలు మారుతున్నాయి. టీడీపీ పుట్టినప్పటి నుంచి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు... ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వైసీపీకి కొమ్ముగాసిన రెడ్లు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. ముద్రగడ చేరికతో జనసేనకు కాపులు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. గతంలో పక్కాగా ఈ కులం వాళ్ళు ఈ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కులం నాయకులు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు.
ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఓ సంచలనం. కాపులకు రిజర్వేషన్లు దక్కాలు, రాజ్యాధికారంలో వాటా కావాలంటూ కొన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. గతంలో టీడీపీ మోసం చేసిందని కోపంగా ఉన్నారాయన. అయితే ఇటీవల వైసీపీతో మంతనాలు జరిగినా... అధిష్టానం తనకు అంతగా ప్రియారిటీ ఇవ్వట్లేదని భావిస్తున్నారు. అందుకే కాపులంతా కలసి పనిచేయాలన్న జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపుతో గ్లాసు పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
టిడిపితో వెళ్ళొద్దని తమతోనే ఉండాలని పవన్ కళ్యాణ్ కు బిజెపి హై కమాండ్ స్పష్టం చేసింది. తమను కాదని వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. దీంతో ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేశారు.
ఎప్పుడో జరగబోయే దానికోసం ఇప్పుడు కళ్ల ముందున్న అవకాశాన్ని వదులుకోవాలా.. అని పవన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వైసీపీని ఓడించకపోతే తాము మరింత ఇబ్బందుల్లో పడతామనేది పవన్ ఆలోచన. అందుకే బీజేపీ మాటలు వినాలా.. లేకుంటే టీడీపీతో వెళ్లాలా.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పవన్ కల్యాణ్ టీడీపీ తరపున రాయబారం చేయడానికి వచ్చారనేది బీజేపీ చెప్తున్న మాట. తమ పార్టీ కోసం కాకుండా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని పొత్తులపై చర్చించడానికి వచ్చినట్లు బీజేపీ భావిస్తోంది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కించుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని తప్పులు ఆ పార్టీని వెనక్కు లాగుతున్నాయి.
50సీట్లు కేటాయిస్తే.. మొదటికే మోసం వచ్చి అవకాశం ఉంటుందని.. జగన్కు మళ్లీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించే ప్రయత్నాలు సాగుతున్నాయ్. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా.. అర్థం చేసుకుంటారా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో నాలుగేళ్లు కలిసి తిరిగి.. తీరా ఎన్నికల సమయానికి వదిలేయడం సరికాదని బీజేపీ నేతలు అంటున్నారు. పవన్ వదిలేస్తే ఏం చేయాలి.. ఎలాంటి అడుగులు వేయాలన్నది బీజేపీ నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది.
జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి వైసీపీ అనుకున్నట్టు జరగదని.. ప్రజలు అనుకున్నట్టే జరుగుతుందని చెప్పారు. దీన్ని బట్టి పొత్తులుంటాయని క్లియర్ గా చెప్పేశారు.
పొత్తులపై తన మనసులో ఏముందో స్పష్టత ఇచ్చేశారు పవన్. ఇప్పటం ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించిన పవన్ సరిగ్గా ఏడాది తర్వాత టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.