Home » Tag » బీజేపీ
మరో 3 నెలల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కనీసం 10 స్థానాలు దక్కిచుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఇవాళ కోర్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మోడీ సభలకు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది.
కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తారేమో.... ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారేమో.... దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతారేమో.... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ నేతలు కౌన్సిలర్ గా కూడా గెలవలేరు. ఇది ఏపీలో బిజెపి నేతల దుస్థితి.
లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసి... ప్రధాని నరేంద్రమోడీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు. కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం. దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మొన్న మహరాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్ లో ఆప్ పార్టీ... ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
బీజేపీలో జహీరాబాద్ ఎంపీ సీటు హాట్ అయిపోయింది. అభ్యర్థులుగా నిన్నటి దాకా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తే... ఇప్పుడు ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారట. కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయి.
ఎప్పుడైనా ప్రజల తరపున పోరాడినప్పుడే పార్టీకి ఆదరణ లభిస్తుంది. అధికార పార్టీకి వంతపాడుతుంటే ప్రజల తరపున ఎలా పోరాడగలరు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఇంతే.
కొద్దిరోజులుగా పార్టీలో వ్యవహారాలపై విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఆమెకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అసంతృప్తితో రాములమ్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో కర్నాటకలో విజయం ఆ పార్టీకి నైతికంగా ఎంతో బలాన్నిచ్చినట్టయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు, ఈ ఏడాదిలో జరగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక విజయం కచ్చితంగా బాటలు పరుస్తుంది.
ఎప్పుడో జరగబోయే దానికోసం ఇప్పుడు కళ్ల ముందున్న అవకాశాన్ని వదులుకోవాలా.. అని పవన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వైసీపీని ఓడించకపోతే తాము మరింత ఇబ్బందుల్లో పడతామనేది పవన్ ఆలోచన. అందుకే బీజేపీ మాటలు వినాలా.. లేకుంటే టీడీపీతో వెళ్లాలా.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మాజీ సీఎం మా పార్టీలో చేరాడని చెప్పుకోవడానికి తప్ప పైసా ప్రయోజనం కూడా కిరణ్ కమార్ రెడ్డి వల్ల ఉండకపోవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి బీజేపీ ఏం ఆశిస్తోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.
పవన్ కల్యాణ్ టీడీపీ తరపున రాయబారం చేయడానికి వచ్చారనేది బీజేపీ చెప్తున్న మాట. తమ పార్టీ కోసం కాకుండా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని పొత్తులపై చర్చించడానికి వచ్చినట్లు బీజేపీ భావిస్తోంది.