Home » Tag » రేవంత్ రెడ్డి
తెలంగాణలో త్వరలో జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు రాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రాతిపదిక లేకుండా ఇష్టమొచ్చినట్టు విభజించారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జిల్లాల శాస్త్రీయ విభజనకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో CMO కార్యదర్శిగా... ఒక వెలుగు వెలిగిన IAS అధికారి స్మితా సభర్వాల్ ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో లూప్ లైన్లో పడ్డారు. 26 మంది IAS అధికారుల బదిలీల్లో స్మిత సభర్వాల్ కు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టును ఆమెకు కేటాయించారు.
రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి సర్కార్ పోస్ట్ మార్టమ్ మొదలుపెట్టింది. ధరణిలో ఎందుకు సమస్యలు వచ్చాయో తెలుసుకోడానికి ఇవాళ మంత్రులతో కలసి రివ్యూ మీటింగ్ పెట్టారే సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ కొత్త మంత్రి వర్గం కొలువుదీరబోతోంది. రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. ఆయనతో పాటు మొత్తం 11 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అక్కడ బలంగా ఉండడం, తన వ్యక్తిగత అనుచరగణం కూడా చెక్కు చెదరకపోవడం.. కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అంచనా వేస్తున్నారు.