Home » Tag » 2023 ELECTIONS
దేశంలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో 20 సీట్లలో పోలింగ్.. మిజోరంలో 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.
అభ్యర్థులతో భేటీ అయిన కేసీఆర్.. పనిలో పనిగా పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు, మైనంపల్లి హ్యాండ్ ఇచ్చిన మల్కాజ్‌గిరికి అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు అంతా ! కట్ చేస్తే ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా.. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చే చాన్స్ ఉందనే ప్రచారం కొత్తగా తెరమీదకు వచ్చింది.
2023 బీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఎక్కువగా.. రైతులు, మధ్యతరగతి, యువత, మహిళలు, టార్గెట్ గా కేసీఆర్ గురి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అంటోంది షర్మిల. ఇవాళ తన పార్టీ ముఖ్య నేతలతో కార్యవర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఇవాళే తమ అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే చెప్పిన షర్మిల ఇప్పుడు పాలేరుతో పాటు మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్. గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ కు ఆరోగ్యం సహకరించక ప్రగతి భవన్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడని చెప్పవచ్చు. ఒకవైపు కేసీఆర్ మరోవైపు హరీష్ రావు.. గులాబీ బాస్ ఆదేశాలతో ఇద్దరు తెలంగాణలో సూడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత యేడాది ప్రగతి నివేదన సభకు తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి 2018 లో రెండో సారి అధికార పగ్గాలు పట్టారు కేసీఆర్.
దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ , మధ్యప్రదేశ్ లో ఒకే విడుతలో, ఛత్తీస్ గఢ్ లో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
కేసీఆర్ తెలివితేటలకే చెక్ పెట్టేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పాగా వేసిన హస్తంపార్టీ.. క్రమక్రమంగా తెలంగాణవైపు ఫోకస్ పెంచింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను పిలవగా అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక బాధ.. వెళ్లకపోతే మరో బాధ..!
కర్నాటక రాజకీయం మొత్తం ఉచితాల చుట్టూ తిరుగుతోంది.
ఇలా జరుగుతుంది అని ఊహిస్తే రాజకీయమే కాదు అది ! బీజేపీ, పవన్ విషయంలోనూ అదే జరిగే అవకాశాలు కనిపస్తున్నాయా అంటే.. కాదు అనడానికి లేదు అనే చర్చ జరుగుతోంది. బీజేపీతో కుదరదు అని ఏపీలో తెగేసి చెప్పిన పవన్.. అదే కమలం పార్టీ తరఫున పక్కరాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారా అనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది.