Home » Tag » 2024 AP Elections
ఏపీలో ఒక పల్లెటూరి ఇది. పోలింగ్ అయ్యాక కనిపించిన దృశ్యం ఇది. వందల మంది ఆటవికంగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ... కర్రలతో కొట్టుకుంటున్నారు. మగాళ్ళకి ఆడాళ్లు కర్రలు , రాళ్లు అందిస్తున్నారు. ఒకరిని మరొకరు చంపాలంటూ అరుస్తున్నారు. ఈ దృశ్యం ఒక్క గ్రామంలోనిదే కాదు.... తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఈ సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటకు 14 లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్‌లో లండన్ వెళ్లిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వీడన్ లో సేద తీరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. షర్మిల కూడా అమెరికా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, చిన్నా చితకా నేతలు కూడా యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇంకొందరు బాలి ద్వీపం వెళ్లి అక్కడ రక రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. మరికొందరు స్విట్జర్లాండ్, బ్యాంకాక్ తోపాటు మరికొన్ని విహార ప్రాంతాల్లో సేద తీరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసిపి ఇప్పటి వరకు తొమ్మిది జాబితాలు విడుదల చేసింది. డిసెంబర్ నుంచి మొదలుపెట్టి కొందరు సిట్టింగ్‌లను తప్పిస్తూ... ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎన్నికల షెడ్యూలు సమయం దగ్గర పడుతుండడంతో... ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై కూడా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటోందట.
చంద్రబాబు తనకు తానుగా డబ్బా కొట్టుకోవడం కొత్తేమీ కాదు.. నిజానికి 'ఆయన' గురించి ఆయన చెప్పుకోవడంలో ఆయనకు మించిన వారు లేరు! ఇదేమీ టంగ్ ట్విస్టర్ కాదు.. అక్షర సత్యం..! ఎవరైనా మనల్ని వేరేవాళ్లు పొగడాలని కోరుకుంటారు. ఒకవేళ ఎవరూ ఆ పని చేయకపోతే కామ్‌గా ఉండిపోతారు.
వాపును బలం అనుకుంటే.. ఫలితం వాచిపోతుంది ఎవరికైనా ! బలం పెంచుకోవడానికి ముందు.. బలమేందో తెలుసుకోవాలి. అప్పుడే యుద్ధం మొదలుపెట్టారు. కనిపించేదేదీ నిజం కాదు. కనిపించిందంతా బలం అనుకుంటే దెబ్బతినడం ఖాయం. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు మాటలు చూస్తే అదే జరగబోతుందేమో అనిపిస్తోంది. ఏపీలో జనసేన గురించి మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. నాగబాబు చేసిన కామెంట్సే దీనికి కారణం.