Home » Tag » 500 gas cylinder
పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని 500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే చాలా మంది ఐదు వందల రూపాయలు ఇస్తే… గ్యాస్ సిలెండర్ (Gas Cylinder) మార్చుకోవచ్చని అనుకుంటున్నారు.
ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని 5వందలకే గ్యాస్ సిలెండర్ హామీ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు అర్హత, షరతులు ఇతర వివరాలతో కూడిన జీవో రిలీజ్ చేసింది. ముఖ్యంగా మూడు కండిషన్లు పెట్టింది.
తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు రూ.500కే సిలిండర్ పొందేందుకు అర్హులు. వీరిలో ఇటీవల నిర్వహించిన జాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాన్ని అమలు చేయనున్నట్లు జీవోలో ప్రకటించారు. ఈ మేరకు రూ.500కే గ్యాస్ పథకానికి సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కోటి అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అప్లయ్ చేసింది. ఇందులో మహిళల బస్సు స్కీమ్ సూపర్ హిట్ అయింది.
మరో రెండు హామీలు అమలు చేసేందుకు రెడీ అయ్యింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 2 వందల యూనిట్ల వరకూ ఫ్రీ పవర్ స్కీంను ఫిబ్రవరి 27 లేదా 29 తేదీల్లో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్’ కూడా ఉంది. ఈ గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని తెలంగాణలో సామాన్య జనం ఎదురు చూస్తున్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.