Home » Tag » 500 Notes
గత నెల రూ. 2వేలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వెంటనే దాదాపు అందరూ తమ వద్ద ఉన్న రూ. 2వేలను బ్యాంకుల్లో, జ్యూవెలరీ షాపుల్లో, వైన్స్ షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో మార్చుకునేందుకు క్యూ కట్టారు. ఇప్పటికే ముద్రించిన నోట్లల్లో సగానికి పైగా బ్యాంకుల్లో జమ అయినట్లు తెలిపింది. అలాగే రూ. 500, రూ. 1000 నోట్ల పై కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
గతంలో నోట్లు అంటే అంతగా పట్టించుకునే వారు కాదు. అవసరమైనప్పుడు ఖర్చు చేసుకునేందుకు మాత్రమే బయటకు తీసేవారు. కానీ గడిచిన ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా ఏ క్షణంలో ఏ ప్రకటన వస్తుందో అన్న భయాందోళనలో ప్రజలు మగ్గిపోతున్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న ఒక సంచలనమే. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ లేడికి లేచిందే పరుగు అన్న విధంగా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను తీసుకున్నాయి. దీని వల్ల ఇబ్బందులకు గురైంది మాత్రం సామాన్యులే అని చెప్పాలి. తాజాగా రెండు వేల నోటును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన ఆర్జీఐ త్వరలోనే మరో బాంబు పేల్చేందుకు సిద్దంగా ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. అదే రూ.500 నోటును కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఇలాంటి సంచలనాలకు కేరాఫ అడ్రస్ గా మారుతోంది. పరిపాలనా లోపమా.. నిజంగానే నల్ల ధనాన్ని వెలికితీయడమా అనేది కేంద్రమే పునరాలోచించుకోవాలి.