Home » Tag » Aadhaar
దేశంలోనే 'అతిపెద్ద' డేటా లీక్ కేసుగా వర్ణించబడుతున్న వాటిలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) నుండి సేకరించబడిన 81.5 కోట్ల మందికి పైగా భారతీయుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి అని న్యూస్ 18 నివేదికలో పేర్కొంది. ఒకే సారి 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' వెల్లడించింది.
మీకు పోస్టాఫీసుల్లో ఎఫ్ డీలు ఉన్నాయా.. క్రెడిట్ కార్డులను విదేశాల్లో వినియోగిస్తున్నారా.. ఇప్పటి వరకూ బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోలేదా.. అయితే ఈ రూల్స్ మీకోసమే. చూసి అలర్ట్ అవ్వండి
రాబోయే అక్టోబర్ 1 నుంచి.. అంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వాళ్లందరూ బర్త్ సర్టిఫికెట్‌ను అన్నింటికీ సింగిల్ డాక్యుమెంట్‌గా వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు అమలవుతున్న బర్త్ సర్టిఫికెట్, బర్త్ ప్లేస్ వంటి వాటికి వేర్వేరు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
నగదు డబ్బుతో బంగారం కొనాలంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో చెల్లింపులు చేయొచ్చు. రూ.2 లక్షల వరకు క్యాష్ ఇచ్చి బంగారం కొనొచ్చు. దీంతో చాలా మంది తమ దగ్గరున్న రెండు వేల రూపాయల నోట్లను చెల్లించి, రెండు లక్షల వరకు విలువైన బంగారం కొంటున్నారు.