Home » Tag » aajadpur market
ఇప్పుడు దేశం మొత్తం ఎటు చూసినా ఉల్లి లొల్లే కనిపిస్తుంది. దీని వల్ల వినియోగదారులకు, వ్యాపారస్తులకు ఆనందంగా ఉన్నాప్పటికీ రైతు కంట ఉల్లి కన్నీరు పెట్టిస్తుంది. ఒకప్పుడు రైతుకు కనీస గిట్టుబాటు ధర అయినా వచ్చేది. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. తాజాగా మహారాష్ట్రలో 512కిలోల ఉల్లిని విక్రయించిన ఒక రైతుకు డీలర్లు కేవలం రూ.2 ఇవ్వడమే దీనికి ఉదాహరణగా చెప్పాలి. ఇదిలా ఉంటే రాబోయే రోజులు రైతుకు మరింత గడ్డుకాలంగా చెప్పాలి. ఇప్పటి వరకూ విక్రయించింది ఒక ఎత్తైతే.. మార్చి 15 తరువాత వచ్చే పరిస్థితులు మరో సాహసోపేతమైనదిగా చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ధరకంటే మరింత తగ్గేలా కనిపిస్తుందంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.