Home » Tag » ACB
ఓ ఉన్నతాధికారి ఇంటికి తనిఖీకి వెళ్లిన సీబీఐకి కోట్ల ఆస్తులు పట్టుబడటం చూశాం. ఓ అవినీతి కాంట్రాక్టర్‌ను కదిలిస్తే వేల కోట్ల నల్లధనం దొరకడం చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ అవినీతిపరుడి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాకౌతారు.
తెలంగాణాలో అవినీతి పరులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు దాడులకు దిగుతున్నారు. అవినీతి పరుడు అనే సమాచారం వస్తే చాలు... ఎంత వరకైనా వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై ఏసీబీ ఫోకస్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ ను ఓపెన్ చేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలను, అధికారులను గురిపెట్టి కొడుతుంది సర్కార్.
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి లంచాలు తీసుకుంటున్నారు అనే సమాచారం తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు. ఎలా అయినా భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుని పక్కా ప్లానింగ్ తో దాడికి దిగారు.
HMDAలో డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు చేశారు విజిలెన్స్ అధికారులు. గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులపై ఆరా తీశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్‌తో పాటు వెంచర్లకు గత 9యేళ్ళుగా అనుమతులు ఇచ్చిన ఫైళ్ళను పరిశీలించారు.
HMDA మాజీ డైరెక్టర్ (Former Director) శివబాలకృష్ణ (Sivabalakrishna) అక్రమాస్తుల చిట్టా విప్పుతుంటే... ACB అధికారులు కళ్లు తేలేస్తున్నారు. అతని పేరుపై వందల ఎకరాల భూములున్నాయి. తెలంగాణలోనే (Telangana) కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి.
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna) అవినీతి (Corruption) కేసులో తవ్విన కొద్దీ ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అనకొండ బాలకృష్ణను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాలకృష్ణ... తెల్లారి నుంచి నోరు విప్పాడు.
శివబాలకృష్ణ వ్యవహారం.. తెలంగాణలో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ అరెస్ట్‌తో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్.
అధికారాన్ని అడ్డం పెట్టుకొన్న అవినీతి తిమింగలం HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అందినంత దోచుకున్నాడు. ఆయన అక్రమ ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. డబ్బులు, ఆస్తిపత్రాలు, పట్టు చీరలు, ఐ ఫోన్లు, వాచీలు, ఆపిల్ ట్యాబ్స్... ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
తాజాగా స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తిరిగి తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని.. నేడు మంధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.