Home » Tag » Actress Kalyani
సత్యం మూవీతో హిట్ కొట్టిన సూర్య కిరణ్.. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. ఐతే ఆమెతో ఎక్కువ కాలం జీవితం గడపలేకపోయారు. ఇద్దరూ విడిపోయారు. ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది.
హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య కిరణ్. ఆ తర్వాత విభేదాల కారణంగా.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తీసిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడం.. అటు పెళ్లి బంధానికి కూడా బీటలు వారడంతో.. మానసికంగా కుంగిపోయి చాలారోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
తమిళ్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్.. తెలుగులో 'సత్యం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. నటుడిగా ఆయన మాస్టర్ సురేష్‌గా ప్రేక్షకులకు పరిచయం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల సినిమాల్లో నటించారు.