Home » Tag » Addanki Dayakar
అయితే BRS టిక్కెట్ నివేదితకు ఇస్తారా లేదా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏకగ్రీవ ఎన్నికపై కాంగ్రెస్, బీజేపీల్లోనూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మోంట్ ఉపఎన్నికలో నిలబడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతల అద్దంకి దయాకర్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
త్వరలో ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయ్. అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. రెండుసార్లు అన్యాయం జరగడంతో.. ఎంపీ టికెట్ అద్దంకికి ఇస్తారని అంతా అనుకుంటే మళ్లీ పాత సీనే కనిపించింది. అభ్యర్థుల జాబితాలో అద్దంకి పేరు ఎక్కడా కనిపించలేదు.
నిజానికి ఒక ఎమ్మెల్సీ సీటు అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని పార్టీ అభిప్రాయానికి వచ్చింది. ఐతే ఆఖరి నిమిషంలో అద్దంకి పేరు జాబితాలో లేకుండా పోయింది. దీంతో అసలు ఏం జరిగిందని చర్చ విస్తృతంగా జరుగుతోంది.
నిన్న గాక మొన్న ఎమ్మెల్సీ టిక్కెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా నిరాశ చెందలేదు. పార్టీ అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్నారు అద్దంకి దయాకర్. ఇంకా మంచి పోస్టు.. ఇంకా పెద్దది ఏమైనా ఇస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్‌కు ఇస్తామని నిన్నటివరకూ చెప్పారు. ఆయనకు ఫోన్ చేసి నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పారు పార్టీ పెద్దలు. కానీ లాస్ట్ మినట్‌లో హ్యాండ్ ఇచ్చారు.
రకరకాల సమీకరణాల తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లు ఖరారయ్యాయ్. గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఫైనల్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు ఈనెల 29న ఎన్నికల జరగబోతోంది. ఈ రెండూ కాంగ్రెస్ కే దక్కనున్నాయి. ఎమ్మెల్యేల కోటాల జరిగే ఈ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) , మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్లను AICC ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈనెల 18లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.
తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి అఖిల పక్షం భేటీని నిర్వహించారు.