Home » Tag » agent
అఖిల్ కెరీర్లోనే అత్యధికంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ రూపొందింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.
వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో తన పేరునే టైటిల్‌గా మార్చుకొని.. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కికనేని అఖిల్ (Akhil).
ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.
అక్కినేని అఖిల్.. తెలుగు ఇండస్ట్రీలో యూత్ అందగాడు. నేచురల్ గ్లామర్ తో తో ముద్దుస్తోతాడు అంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మొహం కి సర్జరీ అంటే నమ్ముతారా.. ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అఖిల్ కనిపించడం లేదు. ఒక్క సినిమా ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అసలు ఏమైపోయాడు అని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు.
గ్లామర్ ఉంది. అందాలు ఆరబోసే టాలెంట్ ఉంది. ఇక పెర్ఫామెన్స్‌లో కూడా పర్లేదనే పేరొచ్చింది. కాని తన అదృష్టమే నిర్మాతలకు అరిష్టంగా మారుతోంది. లాస్ట్ టైం ఏజెంట్ అంటూ అక్కినేని అఖిల్‌తో జోడీకట్టిన సాక్షి వైద్య.. రూ.90 కోట్ల బడ్జెట్‌తో మూవీ చేస్తే, అది డిజాస్టర్ అని తేలింది.
అక్కినేని అయ్యగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. రీసెంట్ గా ఏజెంట్ అని తడిసిన దీపావళి బాంబుల్లాంటి ఫైట్లతో షాక్ ఇచ్చాడు. సరే సినిమా పోయినా ఓటీటీలో సందడి చేస్తుందనుకుంటే, రైట్స్ తీసుకున్న డిజిటల్ సంస్థ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయట్లేదు.
ఈ సీజన్లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.
అక్కినేని మన్మథులు ముగ్గురు ఫ్లాపులతో పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు పెద్ద ప్లాపులు పట్టేస్తూ దూసుకెళుతున్నారు. విచిత్రంగా ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అంతా డిజాస్టర్లతోనే క్యూలు కట్టేస్తున్నారు.
ఫ్లాపులు అందరికీ వస్తాయి. కోలుకుని.. హిట్‌తో నిరూపించుకుంటారు. ఇలా తానేమిటో ఫ్రూవ్ చేసుకోవడానికి ముందు ఛాన్స్ రావాలి. మరి ఏజెంట్ ఫ్లాప్ తర్వాత సురేంద్రరెడ్డికి ఛాన్స్ వస్తుందా? గతంలో హిట్స్ ఇచ్చిన స్టార్స్ ఆదుకుంటారా? లేదంటే మరోసారి యంగ్ హీరోను ట్రై చేస్తాడా?