Home » Tag » Ajit Pawar
అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది.
శరద్ పవర్.. ఆ పార్టీ తిరుగుబాటు నేత, తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో భేటీ అవ్వడం సంచలనం కలిగిస్తోంది. నిజానికి ఈ భేటీ రహస్యంగానే జరిగినప్పటికీ, విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న చర్చ మొదలైంది.
మోదీ అవార్డు స్వీకరించనున్న ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు, అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్, అజిత్ కలవబోతుండటం ఇదే మొదటిసారి.
గత ఏడాది ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇది నిజంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు షాకేనా..?
కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు, అదే పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి, బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.