Home » Tag » Akkineni Family
అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన శోభిత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటి వరకు శోభిత ధూళిపాళ్ళ... ఇప్పుడు అక్కినేని శోభితగా మారిపోయింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఎట్టకేలకు వివాహం చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ జంట అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఇప్పుడు మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ పూజా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. అటు అక్కినేని నాగార్జున కూడా వీళ్ళిద్దరితో కలిసి దైవ క్షేత్రాలకు వెళ్తున్నారు.
ఏదైనా ప్రముఖుల పెళ్ళికి మీడియాలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ప్రత్యేకంగానే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం విషయంలో సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న హడావిడి చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి వేరే లెవెల్ లో ఉంది. ఏడు రోజుల పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. అతిధులు తక్కువే అయినా పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేసారు నాగార్జున.
టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ళ, నాగ చైతన్య వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఈ పెళ్లిలో అన్నీ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోనున్నాయి. అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో జరగనున్న ఈ వివాహ తంతు నేటి నుంచి మొదలయింది.
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడటం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ లు కొట్టి స్టార్ హీరోల కెరీర్ కు పునాది వేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఓ మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
అక్కినేని ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖపై కోర్ట్ లో పరువు నష్టం దావా వేయగా దానిపై కాంగ్రెస్ న్యాయ విభాగం స్పందించింది. కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది సినీ రాజకీయ వర్గాల్లో. కేటిఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలి... ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ వంద కోట్లకు డిమాండ్ చేస్తోంది. నేడు కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది.
తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరో... అక్కినేని నాగేశ్వరరావు. సినిమా పరిశ్రమలో అత్యంత బలమైన కుటుంబం, ధనిక కుటుంబం కూడా. రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు, దేశ వ్యాప్తంగా వ్యాపారాలు ఇలా కంప్లీట్ సక్సెస్.