Home » Tag » Alla Ramakrishna Reddy
ఆళ్ళ రామకృష్ణా రెడ్డి... వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు ఒకప్పుడు. పార్టీ నేతల్లో గాని, కార్యకర్తల్లో గాని ఆయన అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది.
వైసీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. అలా వెళ్లి, ఇలా ఎందుకు రిటర్న్ అయినట్లు..? అసలు కాంగ్రెస్‌లో ఏం జరిగింది..? నిజంగానే షర్మిలతో విభేదాలు వచ్చాయా..? లేదంటే షర్మిల బలం ఏంటో తెలుసుకోవడానికే కోవర్టుగా వెళ్లారా..?
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా.. దూరంగా జరిగిపోతారో, తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్‌గా సీఎం జగన్ ఫోటోను తన వాట్సాప్ డీపీగా మార్చేశారాయన.
టికెట్ రాదు అన్న సమాచారంతో వైసీపీకి రాజీనామా చేసి షర్మిలక్కతోనే అడుగులు.. షర్మిలక్కతోనే ప్రయాణం అని.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. కట్ చేస్తే.. నెలరోజులు తిరగకముందే సీన్ మారింది. ఆళ్ల.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
జగన్ టార్గెట్‌గా షర్మిల గుప్పిస్తున్న విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. జగన్‌ను మరింత కార్నర్ చేసేలా ఆమె సంధించిన విమర్శలు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మైనస్‌గా మారుతుందనే చర్చ మొదలైంది.
జానికి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏమాత్రం పట్టు లేదు. షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. షర్మిల మాటలతో బజ్ క్రియేట్ అయినట్లు కనిపిస్తున్నా.. అవన్నీ ఓట్ల రూపంలోకి మారే చాన్స్ ఏ మాత్రం లేదు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామాతో లోకల్ గ్రూప్ పాలిటిక్స్ ఒక్కసారిగా తెర మీదికి వచ్చాయి. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళకు సొంత పార్టీ నాయకులే చెక్ పెట్టారా? లేక రాబోయే పరిస్థితిని ఊహించి ఆయనే తెలివిగా నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. తాజాగా నియోజకవర్గంలో వెలిసిన రెండో వైసీపీ కార్యాలయమే ఎమ్మెల్యే రాజీనామాకు కారణం అయిందన్న ప్రచారం కూడా ఉంది.
మంగళగిరిలో కొంతకాలంగా వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయ్. వర్గపోరు పీక్స్‌కు చేరుకుంది. ఈ మధ్యే పోటాపోటీగా ఆఫీస్‌లు కూడా ప్రారంభించండం కొత్త చర్చకు కారణం అయింది. నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని అందుబాటులో లేకపోవడంతో.. రిజైన్ లెటర్ ను అసెంబ్లీ సెక్రటరీకి అందించారు. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ను బీసీ నాయకుడికి ఇస్తోందన్న ప్రచారంతో ఆయన అధిష్టానంపై అలకబూనారు. చివరకు మంగళగిరి ఎమ్మెల్యేకి, వైసీపీకి కూడా రాజీనామా చేశారు రామకృష్ణారెడ్డి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆర్కే అసెంబ్లీలో తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేశారు. ఆర్కే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.