Home » Tag » alliance
మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం పెడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలిచ్చారు. అలాగే.. ఇటీవల జనాల్ని భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.
టికెట్ల పెంపు రచ్చ టైమ్‌లో జగన్, చిరు మధ్య జరిగిన పరిణామాలను.. ఇప్పుడు బయటకి తీసుకున్నారు సేనాని. ఇలాంటి పరిణామాల మధ్య.. సీఎం రమేష్‌కు చిరు సపోర్ట్ చేయడం అంటే.. అది కూటమికి సపోర్ట్ చేసినట్లే అనే డిస్కషన్ మొదలైంది. దీనిపై ఇప్పుడు వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.
AP లో పోటీపై షర్మిల కీలక వ్యాఖ్యలు
హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. అందువల్లే సీఎం ఖట్టార్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కూటమిలోని పార్టీల మధ్య ఎన్ని విబేధాలు తలెత్తినా కనీసం 400 స్థానాల్లో కలిసిపోటీ చేస్తామని, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా తెలిపారు. త్వరగా ఇండియా పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ కేటాయించిన కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐ అంగీకరించగా.. సీపీఎం మాత్రం తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తితోనే ఉంది. కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది సీపీఎం. పార్టీని బలిపెట్టేందుకు తాము సిద్ధంగా లేమంటున్నారు.
గతంలో కాంగ్రెస్ 3000 ఓట్ల నుంచి 1000 ఓట్ల కంటే తక్కువ తేడాతో బీఆర్ఎస్ పై విజయం సాధించింది. ఈ అవకాశం కాంగ్రెస్ కు మరోసారి ఇవ్వకూడదని భావిస్తోంది కారు పార్టీ. తన గులాబీ పరిమళాన్ని ఈ 16 స్థానాల్లో గుబాళింపజేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ ముఖ చిత్రం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. ఏ క్షణంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియని పరిస్థితి. తాజాగా జనసేన అధినేత బీజేపీ పెద్దల్ని కలిశారు. పొత్తు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. కాపు నేస్తం అనే సంక్షేమ పథకంతో ప్రజలకు లబ్ధి చేకూరేలా నిడదవోలులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచి చంద్రబాబుపై పెద్దగా టార్గెట్ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే హైలైట్ చేశారు. దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి.. అనే అంశం పై పూర్తి వివరాలు చూద్దాం.
టీడీపీ-జనసేన మధ్య పొత్తులు కుదిరాయి. మొన్నటి వరకు పొత్తులపై క్లారిటీ రావాల్సి ఉన్న క్రమంలో సీట్లపై అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పొత్తులు పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు.. ఏయే స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనే అంశంపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి సీటు పోతుంది..? ఎవరి ఫేటు మారుతుంది..?అనే చర్చ జరుగుతోంది.