Home » Tag » Allu Aravind
తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ గోక్కోవడం అనేది కచ్చితంగా కంగారు పడాల్సిన విషయమే. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ముఖ్యంగా పోలీసులకు చిరాకు తెప్పించాయి అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.
ఆహా ప్లాట్ ఫాంపై నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ను ఇప్పుడు సినిమా వాళ్ళు ఓ రేంజ్ లో వాడుకోవడం మొదలుపెట్టారు. ఏ సినిమా ప్రమోషన్ అయినా సరే అన్ స్టాపబుల్ లో జరగాల్సిందే అన్నట్లు ఉంది.
సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం సినిమా పరిశ్రమను చాన్నాళ్లపాటు వెంటాడుతుంది అనే మాట వాస్తవం. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను చాలామంది తప్పుపట్టారు. అసలు పోలీసులకు సమాచారం లేకుండా వెళ్లాడు అనేది ప్రభుత్వ వాదన కూడా.
సంధ్య థియేటర్ వ్యవహారం నుంచి బయటకు రావాలని అల్లు ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అల్లు అరవింద్ తన కొడుకుని ఈ కేసు నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వాన్ని శాంతింప చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
2024... విషయంలో కల్కీ... దేవర, పుష్ప 2 తో టాలీవుడ్ ఒకపక్క సంతోషంగా ఫీల్ అయినా మరో పక్కన కన్నీళ్లు పెట్టుకుని తలబాదుకునే పరిస్థితి. గతంలో తెలుగు సినిమాలు హిట్ అయినా హిట్ కాకపోయినా టాలీవుడ్ 2024లో బాధపడినంత రేంజ్ లో కరోనా టైం లో కూడా బాధపడలేదు అనే మాట అక్షరాల నిజం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ సినిమా రేంజ్ లోనే ఉన్నాయి.
అతను నడుస్తుంటే బాడీ లాంగ్వేజే వేరుగా ఉంటుంది. మాటలు చేష్టలు,... అన్ని యాంగిల్స్ లోను ఆత్మవిశ్వాసానికి బదులు అతివిశ్వాసం బయటపడుతుంది. 5 ఏళ్లలో గట్టిగా మూడు సినిమాలు హిట్ అయ్యేటప్పటికి నన్ను మించినోడు ఇక్కడ లేడు అనుకున్నాడు. తన ఫ్యాన్స్ కి ఏకంగా అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడు.
పుష్ప హీరోకి వైసీపీ ఎందుకంత ఎలివేషన్ ఇస్తోంది ? అల్లు అర్జున్ ను వైసీపీ ఓన్ చేసుకుంటోందా ? అరెస్టు విషయంలో వైసీపీ నేతలు అతిగా స్పందించారా ? ఒకరేమో ఖండిస్తారు. ఇంకొక్కరేమో పవన్ పాత్ర ఉందంటారు. మరొకరు అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని అంటారు ? పుష్పకు నిజంగానే అంతసీన్ ఉందా ?
అన్ స్టాపబుల్ సీజన్ 4 క్రేజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇప్పటి వరకు ప్రసారం అయిన 3 సీజన్లు ఒక లెక్క ఈ సీజన్ ఒక లెక్క అంటున్నారు ఫ్యాన్స్. అల్లు అరవింద్ సీజన్ 4 విషయంలో పక్కా ప్లానింగ్ తో దిగుతున్నారట. ఇప్పటి వరకు పిలవని వాళ్ళను, ఆల్రెడీ షో కి వచ్చిన వాళ్ళను కూడా మళ్ళీ ఆహ్వానిస్తుంది ఆహా టీం.
మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని త్వరగా ముగించాలని టాలీవుడ్ పెద్దలు కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో అల్లు, మెగా కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.