Home » Tag » Amazon Prime
బాలీవుడ్ (Bollywood) నటి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ.. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ తాజాగా మ్యాజిక్ డ్రెస్ తో అందరిని మాయ చేసింది.
టాలీవుడ్ (Tollywood) లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha) లకు సంబంధించి ఎలాంటి పర్సల్ అప్డేట్ వచ్చినా దాని గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటగా ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో వీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది.
ఓటీటీ కాలం నడుస్తోంది. ప్రేక్షకులను అలరించాలి ..చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.
నేటి సినిమా ప్రపంచం మరింత సౌకర్యవంతంగా మారిపోయింది. సినిమా అంటే థియేటర్లకు వెళ్లి చూడాలనే పరిస్థితులు ఇప్పుడు లేవు. అంతగా వెళ్లాలనుకునే వారు రీవ్యూలు, రేటింగ్ లు చూసి బాగుందంటే మాత్రమే వెళ్తున్నారు. దీనికి గల కారణం ఓటీటీ మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోవడం. ఇందులో కామెడీ నుంచి క్రైమ్ వరకూ అన్ని జోనర్ల సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్లలో అయినా నెలకు ఒక సినిమా విడుదల అవుతుంది. అందున తన అభిమాన హీరో సినిమా అయితే ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే విడుదల అవుతాయి. అంటే రెండు సార్లు సినిమా థియేటర్లకు వెళ్లి వినోదాన్ని ఆస్వాధించడం కన్నా.. ఇలా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తూ సమయాన్ని వినోదభరితంగా మార్చుకుంటున్నారు. అలా ఈ ఓటీటీ ప్లాట్ ఫాం సినిమాల విడుదలకు సరికొత్త మార్గాన్ని సులభతరం చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో మీరు చూస్తున్న వెబ్ సిరీస్ ఆగిపోవచ్చు.. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావాల్సిన కొత్త సినిమాకు బ్రేక్ పడొచ్చు.. HBOలో యాక్షన్ మూవీ సిరీస్ ప్రసారం కాకపోవచ్చు.. ఎంటర్టైన్మెంట్ మొత్తం ఆగిపోవచ్చు. ఎందుకంటే హాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈ యూనియన్ పరిధిలో ఉన్న 11500 మంది స్క్రీన్ రైటర్స్ విధులు బహిష్కరించారు. దీంతో సినిమా, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన స్క్రిప్టింగ్ వర్క్ మొత్తం నిలిచిపోయింది.
ప్రస్తుతం సినిమాల నుంచి సరదాగా వచ్చే రియాలిటీ షోల వరకూ ఏమి చూడాలన్నా సామాజిక మాధ్యమాల్లోని అమెజాన్, ఆహా, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ వేదికలపై ఆధారపడాల్సిందే. ఇందులో మనకు కావల్సిన వినోదాన్ని చూసి ఆస్వాదిస్తారు. అలాంటి క్రమంలో వీరికి డిమాండ్ కొంచం పెరిగింది. అందుకే అమెజాన్ ప్రైమ్ ధరలను భారీగా పెంచేందుకు సిద్దమైంది. వాటి పెరిగిన ఛార్జీలు ఎలా ఉన్నాయో చూద్దాం.