Home » Tag » AMIT SHA
2024లో కేంద్రంలో తిరిగి అధికారమే లక్ష్యంగా సమూల మార్పులకు దిగారు జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా. వెనకబడిన తరగతిగా చెప్పుకొనే పాస్మాండ ముస్లిం వర్గానికి చెందిన తారిఖ్ మన్సూర్‌కు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళా నేత లతా ఉసేండికి, బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చింది.
దేశానికి చెందిన క్రీడాకారులు ఏదైనా ఘనత సాధిస్తే అది తన ఖాతాలో వేసుకునే మోదీ.. మణిపూర్ అల్లర్ల విషయంలో మాత్రం ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ ఆయన నోటిలో నుంచి మణిపూర్ అనే మాట రాలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగబోతుంది. మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అనువుగా అవసరమైన ప్రణాళికల్ని ఈ సమావేశంలో మోదీ.. కేంద్ర మంత్రులకు, పార్టీ నేతలకు వివరిస్తారు. దీనిపై దిశానిర్దేశం చేస్తారు.
జూలై, 3, సోమవారంనాడు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ.. అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభుత్వంలో, పార్టీలో చేయబోతున్న మార్పుల గురించి వివరిస్తారు
చంద్రబాబు తరచూ తన రాజకీయ అవసరాల కోసం వ్యూహాలను వేగంగా మార్చేస్తుంటారు. మిత్రులను శత్రువులుగా చేసేస్తారు. వర్గ శత్రువులను కూడా కౌగిలించుకుంటారు.