Home » Tag » Amith Sha
BRSను కలిపేస్తాం... కవితను వదిలేయండి... ఇది ఇప్పుడు బీజేపీ ముందు కేసీఆర్ పెట్టిన రిక్వెస్ట్. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు జీవితం 100 రోజులు దాటాయి. 15 రోజులకో... నెలకో బయటకు వస్తుందిలే అని ధీమాగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి చుక్కలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి.. ఆ సౌండ్ ఢిల్లీ వరకు రీసౌండ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ బీజేపీ. 400 ప్లస్ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. తెలంగాణ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలను తెలంగాణలో గెలుచుకునేలా.. ఢిల్లీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళ టాక్ అంతా దీనిపైనే నడిచింది. అయితే ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో....మూడు కీలక రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఊహించని విధంగా ఛత్తీస్ గఢ్ కూడా కమలం ఖాతాలో పడింది. ఇప్పుడు దేశంలో 12 రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించింది. ఇదే జోష్ తో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది. కానీ దక్షిణాదిలో మాత్రం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ పవర్ లోకి రావడం లేదు. ఇక వచ్చే అవకాశం లేదా అని మధనపడుతున్నారు ఆ పార్టీ పెద్దలు
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన... కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందన్నారు. ఆ సిటీ ఈ సిటీ అటూ భూముల కబ్జాలకు పాల్పడిందని మండిపడ్డారు అమిత్ షా.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోపూ సీట్ల సర్థుబాటు విషయంలో ఒక కొలిక్కి రావాలని చెప్పారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 27న సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సరికొత్త విధానాలతో ముందుకు సాగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై గతంలో వేసిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. మరోసారి అదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నన్ను కలవాలనుకుంటున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. దీంతో అమిత్ షాను కలిసి, ఆయనకు అన్ని విషయాలు వివరించా. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నట్లు చెప్పా. చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళన కూడా చెప్పా.
గత 20 రోజులుగా ఢిల్లీ పెద్దలను కలవాలని మకాం వేసిన లోకేష్ కి తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించింది. దీంతో బుధవారం రాత్రి నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రికి తమపై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు గురించి లోకేష్ వివరించారు. ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.
బీజేపీలో అంతర్గత పోరు తీవ్రమౌతోందా.. పార్టీని వీడేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.