Home » Tag » Amrapali Kata
తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ ఇచ్చిన తీర్పు తో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణా ప్రభుత్వం అన్వేషిస్తోంది.
ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ.. సీఎంవో సెక్రెటరీగానే స్మిత సబర్వాల్‌కు ఎక్కువ పేరుంది. కేసీఆర్‌కు చాలా దగ్గరి మనిషి అనే వాదన కూడా ఉంది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా పనులు తన స్వార్థానికి చేయించుకుంది అనే అపవాదు, ఆరోపణలు కూడా ఉన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి అమ్రాపాలిని హెచ్ఎండీఏ డిప్యుటీ కమిషనర్‌గా నియమించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డ్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు అప్పజెప్పారు. మూసీ నదిని డెవలప్ చేసేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అమ్రాపాలి.. తన మార్క్ చూపించడం మొదలు పెట్టారు.
స్మితా సబర్వాల్, ఆమ్రపాలి మధ్య వృత్తిపరంగా.. ఉద్యోగపరంగా చాలా పోలికలు కనిపిస్తాయ్. ఇద్దరు చిన్న ఏజ్‌లోనే సివిల్స్ క్రాక్ చేశారు. స్మితా సబర్వాల్ 4వ ర్యాంక్ సాధిస్తే.. ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు.
స్మిత సబర్వాల్‌ను పంపించిన రేవంత్.. ఆమ్రపాలిని తీసుకువచ్చేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తెలంగాణకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా.. అంటే సీఎంవో సెక్రటరీగా వస్తున్నట్లు సమాచారం.