Home » Tag » Anant
దేశమంతా సోషల్ మీడియాకు అతుక్కుపోయి.. అనంత్, రాధికా అంబానీ పెళ్లి వేడుకలను ఎంజాయ్ చేసింది. తెలిసిన వాళ్ల ఇంట్లో వేడుక అన్న రేంజ్లో.. జనాలు చాలామంది.
గత కొంతకాలంగా ఇండియాలో ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే.. ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే.. మరి ఇప్పుడు వాళ్ళ ఇంటి పెళ్లి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. భారత దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. సారి సారి మాట్లాడుకునేలా చేశాడు ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ.. ఆయన ఇంట పెళ్లి అంటే మాములుగా ఉండదుగా.. అందుకే ఇంతా చెప్పాల్సి వస్తుంది. ఇక ఆయన పెళ్లి వేడుకలకు ఎంత మంది వచ్చారో.. చూద్దాం రండి మరి... అనంత్ రాధికా అంబానీ పెళ్లి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వేత్తలు.. సినీ పరిశ్రమ వేతలు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, ఇలా ఏ రంగం వదల కుండా అన్ని రంగాలకు పెళ్లి వేడుక ఆహ్వాన పత్రికను పంపించారు. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు రామ్చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్ కూడా వేడుకలో కనిపించారు. కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, కన్నడ నుంచి రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.